అట్లాంటా గణేష్ ఉత్సవాలో సందడి చేసిన చిన్నారులు
సకల విఘ్నాలు తొలగించేంది వినాయకుడు. పెద్దతల గొప్పగా ఆలోచించమంటుంది. గొప్ప ఆలోచనతోనే గొప్ప ఆచరణ. గొప్ప ఆచరణ ద్వారానే గొప్ప విజయాలు. పాతాళాన్ని చూస్తూ ఆకాశాన్ని అందుకోలేం. ఆకాశాన్ని చేరుకోవాలంటే ఆకాశమంత ఉన్నతంగానే ఆలోచించాలి. చిన్నకళ్లు.. చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యన్ని నర్మగర్భంగా చెబుతాయి. పెద్దకళ్లకు చంచలత్వం ఎక్కువ. ఎటుపడితే అటు తిరిగేస్తుంటాయి. చిన్నకళ్లకు ఆ అవరోధాలేం ఉండవు. గురి చుట్టూ గిరిగీసుకుంటాయి. చాట చెవులు.. నలు దిక్కుల




