దేశవిదేశాల్లో ‘కలాం డే

నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా, సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా, వివేకానందుడి జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకొంటాం. కాకపోతే ఇవన్నీ మన దేశంలో మాత్రమే జరిపేవి. వీటికి భిన్నంగా భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‍ కలాం పేరున స్విట్జర్లాండ్‍లో ‘సైన్స్ దినోత్సవం జరుపుతారు. అలా ఎందుకంటే, కలాం భారత రాష్ట్రపతి హ•దాలో 2005, మే 26న స్విట్జర్లాండులో పర్యటించారు. కలాంను భారతదేశ క్షిపణి పితామహుడిగా కీర్తిస్తూ, ‘సైన్స్ అండ్‍ టెక్నాలజీ’ రంగంలో ఆయన అందించిన సేవల్ని కొనియాడుతూ తమ భూభాగం మీద ఆయన అడుగుపెట్టిన రోజుని ‘సైన్స్ దినోత్సవం’గా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ఆ పర్యటనలో కలాం జెనీవాలోని ‘యూరోపియన్‍ ఆర్గనైజేషన్‍ ఫర్‍ న్యూక్లియర్‍ రిసెర్చ్ (సెర్న్)ని సందర్శించారు కూడా. ఇదే కాదు, కలాం పుట్టిన రోజైన అక్టోబరు 15ను 2010లో ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించింది. కలాం మరణం తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబరు 15నే ‘వాచన్‍ ప్రేరణ్‍ దినోత్సవం’ గా ప్రకటించింది. ఆ రోజున విద్యార్థులు తరగతి గదిలో పుస్తకాలు కాకుండా కథలూ, కవిత్వాలు చదువుతారు. తమిళనాడులో అదే రోజు ‘యువజన స్ఫూర్తి దినోత్సవం’.

Review దేశవిదేశాల్లో ‘కలాం డే.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top