ఈ మధ్య ఏ వార్తా పత్రిక చూసినా, సామాజిక
మాధ్యమాల్లో చూసినా గజకేసరి యోగం గురించి వ్యాసాలు కనిపిస్తున్నాయి. చాలామంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
అసలీ యోగమేమిటి? దీనివల్ల కలిగే శుభాశుభ ఫలితాలేమిటి? ఈ యోగం స్త్రీ పురుషుల ఇద్దరి జాతకంలోనూ ఉంటుందా? ఇంతకుముందెప్పుడూ వినని ఈ యోగం గురించి ఈ మధ్యే ఎందుకు చర్చ జరుగుతోంది?
గజకేసరి యోగం అనేది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినదేమీ కాదు. మన జ్యోతిష శాస్త్రంలో ఇదెప్పటి నుంచో ఉంది. ఈ శాస్త్రంలో ఈ యోగాన్ని గురించి చాలా స్పష్టమైన వివరాలున్నాయి. జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగమనేది చాలా ముఖ్యమైనది కూడా. 2026 మరియు 2027 సంవత్సర ప్రారంభంతో కలిపి దాదాపు పదిహేను సార్లు ఈ యోగం ఏర్పడనుంది. కాబట్టి దీనిపై ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. దీంతో దీని గురించి అందరూ తెలుసుకోవాలనే ఆసక్తిని చూపిస్తున్నారు.
గజకేసరి యోగం గురించి జ్యోతిష శాస్త్రంలో తొలి వాక్యం ఇలా ఉంటుంది..
‘‘సురగురో: కేంద్రగే కేసరీతి’’
అంటే చంద్రుని నుంచి కేంద్ర స్థానాల్లో (లగ్నం, చతుర్థ, సప్తమం, దశమం) గురువు ఉంటే అది కేసరి యోగం. అనగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. చంద్ర – గురు యుతి (గ్రహాలు ఒకే రాశిలో కలవడం) కూడా ఇదే యోగానికి చెందుతుంది. అయితే, కేవలం ఈ స్థానం సరిపోదు. గురువు నీచస్థితిలో ఉండ కూడదు. అస్తంగతుడై ఉండకూడదు. పాపగ్రహ ప్రభావం అధికంగా ఉండకూడదు. చంద్రుడు కూడా బలహీనంగా లేకుండా శుభస్థితిలో ఉన్న ప్పుడే ఈ యోగం సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది.
గజకేసరి యోగమంటే..
‘గజకేసరి’ అనే పేరులో ఒక లోతైన తాత్త్విక, జ్యోతిషార్థం దాగి ఉంది. గజము (ఏనుగు)ను స్థిరత్వం, సహనం, సమూహ బలం వంటి గుణాలకు ప్రతీకగా భావిస్తారు.
కేసరి (సింహం) ధైర్యం, పరాక్రమం, నాయకత్వానికి సూచిక. ఈ యోగంలో చంద్రుడిని కేసరి (సింహం)తో గురువును గజము (ఏనుగు)తో పోల్చారు. దీనిలో అంతరార్ధం ఏమిటంటే, చంద్రుడు చురుకుదనం, స్పందన, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండగా, గురువు స్థిరమైన జ్ఞానం, గంభీరత, ఆధారబలం కలిగిన గజకేసరి యోగం అనేది ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చినదేమీ కాదు. మన జ్యోతిష శాస్త్రంలో ఇదెప్పటి నుంచో ఉంది. ఈ శాస్త్రంలో ఈ యోగాన్ని గురించి చాలా స్పష్టమైన వివరాలున్నాయి. జ్యోతిష శాస్త్రంలో గజకేసరి యోగమనేది చాలా ముఖ్యమైనది కూడా. 2026 మరియు 2027 సంవత్సర ప్రారంభంతో కలిపి దాదాపు పదిహేను సార్లు ఈ యోగం ఏర్పడనుంది. కాబట్టి దీనిపై ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. దీంతో దీని గురించి అందరూ తెలుసుకోవాలనే ఆసక్తిని చూపిస్తున్నారు.
గజకేసరి యోగం గురించి జ్యోతిష శాస్త్రంలో తొలి వాక్యం ఇలా ఉంటుంది..
‘‘సురగురో: కేంద్రగే కేసరీతి’’
అంటే చంద్రుని నుంచి కేంద్ర స్థానాల్లో (లగ్నం, చతుర్థ, సప్తమం, దశమం) గురువు ఉంటే అది కేసరి యోగం. అనగా గజకేసరి యోగం ఏర్పడుతుంది. చంద్ర – గురు యుతి (గ్రహాలు ఒకే రాశిలో కలవడం) కూడా ఇదే యోగానికి చెందుతుంది. అయితే, కేవలం ఈ స్థానం సరిపోదు. గురువు నీచస్థితిలో ఉండ కూడదు. అస్తంగతుడై ఉండకూడదు. పాపగ్రహ ప్రభావం అధికంగా ఉండకూడదు. చంద్రుడు కూడా బలహీనంగా లేకుండా శుభస్థితిలో ఉన్న ప్పుడే ఈ యోగం సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది.
గజకేసరి యోగమంటే..
‘గజకేసరి’ అనే పేరులో ఒక లోతైన తాత్త్విక, జ్యోతిషార్థం దాగి ఉంది. గజము (ఏనుగు)ను స్థిరత్వం, సహనం, సమూహ బలం వంటి గుణాలకు ప్రతీకగా భావిస్తారు.
కేసరి (సింహం) ధైర్యం, పరాక్రమం, నాయకత్వానికి సూచిక. ఈ యోగంలో చంద్రుడిని కేసరి (సింహం)తో గురువును గజము (ఏనుగు)తో పోల్చారు. దీనిలో అంతరార్ధం ఏమిటంటే, చంద్రుడు చురుకుదనం, స్పందన, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండగా, గురువు స్థిరమైన జ్ఞానం, గంభీరత, ఆధారబలం కలిగిన గ్రహంగా భావించ బడుతున్నాడు. అయితే, ఇది శాస్త్రంలో నిశ్చితంగా నిర్ణయించిన నిర్వచనం కాదు. గుణాల ఆధారంగా ఇచ్చిన రూపకార్థ వివరణ మాత్రమే.
జ్యోతిషం దృష్టిలో చంద్రుడు మనసును, భావోద్వేగాలను సూచిస్తాడు.
గురువు జ్ఞానాన్ని, వివేకాన్ని, ధర్మబుద్ధిని సూచిస్తాడు.
ఈ రెండూ కేంద్ర సంబంధంలో ఉన్నప్పుడు, మనసు జ్ఞానం ద్వారా మార్గదర్శకత్వం పొందుతుంది. అంటే చంచలమైన భావోద్వేగాలు గురు ప్రభావంతో స్థిరత్వాన్ని పొందుతూ, నిర్ణయాలు వివేకపూర్వకంగా మారతాయి. అందువల్ల గజ బలం కలిగిన శక్తిని కేసరి నాయకత్వం నడిపిస్తున్న స్థితిగా అర్థం చేసుకోవాలి. ఈ సమన్వయమే గజకేసరి యోగం అసలు తత్త్వం.
ఈ యోగం ఫలితాలను శాస్త్రం మరింత స్పష్టంగా ఇలా వర్ణిస్తుంది.
కేసరీవరిపు వర్గనిహంతా ప్రౌఢవాక్సదసి రాజసవృత్తి:।
దీర్ఘజీవ్యతియశా: పటుబుద్ధి స్తేజసా జయతి కేసరియోగే।।
ఈ శ్లోకార్థం ప్రకారం గజకేసరి యోగంలో జన్మించిన వ్యక్తి శత్రువులను జయించే శక్తి కలిగి ఉంటాడు. వాక్పటుత్వంతో సభల్లో గౌరవం పొందుతాడు. రాజసమైన స్వభావంతో జీవిస్తాడు. దీర్ఘాయుష్మంతుడు, కీర్తిశాలి, తేజోవంతుడు, మేధస్సుతో అన్ని కార్యాలలో విజయాన్ని సాధించే వాడు అవుతాడు.
స్త్రీ పురుషుల జాతకంలో గజకేసరి యోగం..
స్త్రీ, పురుషుల జాతకంలో గజకేసరి యోగం ఉన్నప్పటికీ ఫలితాల్లో స్వల్ప భేదం ఉంటుంది. పురుషుడికి ఇది నాయకత్వం, గౌరవం, ధన సంపత్తి, నిర్ణయశక్తి ఇస్తే, స్త్రీకి ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతాన సుఖం, గౌరవప్రదమైన కుటుంబ జీవితాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ ఫలితాలు యథాతథంగా రావాలంటే గురు-చంద్రుల బలం అత్యంత ముఖ్యం. ఈ యోగం ప్రధానంగా జన్మ జాతకంలో పరిశీలిస్తారు. జన్మించిన సమయంలో ఈ యోగం ఉన్నట్టయితే అది వ్యక్తికి జీవితమంతా ఒక అంతర్గత శక్తిగా ఉంటుంది. కానీ, ఫలితాలు తక్షణమే కనిపించవు. అవి దశా-భుక్తి అనుకూలంగా వచ్చినపుడు వ్యక్తి జీవితంలో ప్రతిఫలిస్తాయి. అందువల్ల ‘యోగం ఉంది’ అనేది సామర్థ్యం మాత్రమే. ‘దశ వచ్చింది’ అనేది ఆ సామర్థ్యం ఫలితంగా మారే సమయం.
గోచారంలో కూడా చంద్రుడు గురువుతో కలిసి నపుడు లేదా కేంద్ర సంబంధం ఏర్పడినపుడు తాత్కాలికంగా గజకేసరి ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్ర-గురు యుతి ప్రతి నెలా ఒకసారి సుమారుగా ఏర్పడుతుంది. ఈ యుతి సమయంలో చిన్న స్థాయిలో గజకేసరి ప్రభావం అనుభవించవచ్చు. అయితే, ఇది స్థిర యోగంలా కాదు కేవలం కొన్ని రోజులు మాత్రమే ప్రభావం ఉంటుంది.
ఇక, గోచారంలో చంద్రుడు గురువుతో కలిసినపుడు లేదా కేంద్ర సంబంధం ఏర్పడినపుడు తాత్కాలికంగా గజకేసరి ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా చంద్ర-గురు యుతి ప్రతి నెలా సుమారు ఒకసారి జరుగుతుంది.
మొత్తానికి గజకేసరి యోగం అనేది మనసు, జ్ఞానం మధ్య సమన్వయాన్ని సూచించే శక్తిమంతమైన యోగం. ఇది ఉన్న వారికి ఉన్నత స్థాయికి ఎదగగల సామర్థ్యం ఉంటుంది. అయితే, ఆ సామర్థ్యం ఫలితంగా మారేది కాలాను గుణంగా, దశానుగుణంగా, వ్యక్తి స్వయంకృషి ఆధారంగానే నిర్ణయమవుతుంది. ఇదే గజకేసరి యోగం అసలు సారాంశం.
























































































































































































































































































































































































































Review ధర్మసందేహం.