ఏ పని తలపెట్టాలన్నా ముందుగా చూసేది- ‘మంచి ముహూర్తం’. బారసాల దగ్గరి నుంచి పెళ్లిళ్ల వరకు, భూమిపూజ మొదలుకుని గృహప్రవేశం వరకు.. ఇంకా కార్యాలయాలు, కొత్త పనుల ప్రారంభం దాకా ఏ శుభకార్యమైనా మంచి సమయంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందనేది అందరి విశ్వాసం. ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, పిల్లల్ని బడిలో వేసినా.. మంచి రోజులు చూసుకుని చేయడం మన సంప్రదాయం. అందుకే ప్రతి సంవత్సరంలో ఏయే నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయో, ఏ సమయంలో శుభ కార్యక్రమాలు తలపెట్టకూడదో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. మరి, ఈ శ్రీపరాభవ నామ సంవత్సరంలో మంచి రోజులు, మౌఢ్యమి కాలం, వాస్తు కర్తరి, పుష్కరాలు ఇతర పర్వదినాలు ఏయే నెలల్లో ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందామా. పరాభవ నామ సంవత్సరం మొదలై దాదాపు మూడు నెలలైపోయింది. మిగతా వచ్చే నెలల్లో (2026 జూన్ నుంచి 2027 ఏప్రిల్ 2 వరకు) మంచి రోజులేమున్నాయంటే..
మౌఢ్యమి కాలం:
గ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలోకి చేరినప్పుడు ఆ గ్రహం ప్రభావం తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని మౌఢ్యమి అంటారు. దీనినే వ్యావహారికంలో మూఢమి అని కూడా పిలుస్తారు. మూఢమి సమయంలో సదరు గ్రహం తన శక్తిని సరిగా ప్రదర్శించలేదని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మౌఢ్యమి రెండు రకాలు. ఒకటి- గురు మౌఢ్యమి. రెండు- శుక్ర మౌఢ్యమి. ఈ గురు, శుక్ర గ్రహాల మౌఢ్యమి కాలాల్లో వివాహాలు, గృహప్రవేశాలు, వంటి శుభకార్యాలు తలపెట్టకూడదని పంచాంగాలు సూచిస్తున్నాయి.
గురు మౌఢ్యమి కాలం:
2026 జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు గురు మౌఢ్యమి. తిథుల ప్రకారం చెప్పాలంటే, ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి శ్రావణ శుక్ల విదియ వరకు.. మొత్తం 30 రోజులు.
శుక్ర మౌడ్యమి కాలం:
2026 అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 29 వరకు, అంటే తిథానుసారం ఆశ్వయుజ శుక్ల అష్టమి నుంచి ఆశ్వయుజ బహుళ చవితి వరకు పది రోజుల పాటు శుక్ర మౌఢ్యమి కాలం ఉంటుంది.
ఈ గురు, శుక్ర మౌఢ్యమి కాలాల్లో శుభకార్యాలను తలపెట్టకూడదు.
ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం:
2026 సంవత్సరంలో భారతదేశంలో కంటికి కనిపించే సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం లేవు. అయితే గణితపరంగా ఒక ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం నమోదవుతుంది. ప్రచ్ఛాయ గ్రహణం సాధారణంగా కంటికి కనిపించదు. టెలిస్కోప్ ద్వారా చూసినప్పుడు చంద్రుడు కొంచెం మసకబారినట్టు కనిపిస్తాడు. ప్రచ్ఛాయ గ్రహణాలకు నియమాలు వర్తించవు.
గ్రహణ సమయం:
2027, ఫిబ్రవరి 21, ఆదివారం అర్ధరాత్రి వేళ ఈ ప్రచ్ఛాయ చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది.
ఈ గ్రహణం ప్రారంభ కాలం: రాత్రి 2.42 గంటలు.
గ్రహణం మధ్య కాలం: రాత్రి 4.43 గంటలు.
గ్రహణం విడిచే సమయం: ఉదయం 6.43 గంటలకు.
ఇంకా 2026 ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం, ఆగస్టు 28న పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడతాయి.
2027లో సంక్రాంతి ఎప్పుడంటే..
పరాభవ నామ సంవత్సరంలో మకర సంక్రాంతి 2027, జనవరి 14, 15 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) సంభవిస్తుంది. సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండో పాదంలో 2027, జనవరి 14న రాత్రి 2.24 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రమణం రాత్రి వేళలో జరిగినందున జనవరి 15న సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. శాస్త్ర వచనం ప్రకారం మకర సంక్రమణం తరువాత 20 ఘడియలు (సుమారు 8 గంటలు) పుణ్యకాలం. ఈ సందర్భంగా స్నానాలు, జపాలు, తర్పణాలు, దానాలు చేయడం శ్రేయస్కరం.
వాస్తు కర్తరి:
సూర్యుడు భరణి నక్షత్రంలోని 3వ పాదంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోహిణి నక్షత్రంలోని రెండో పాదం వరకు ఉండే కాలాన్ని వాస్తు కర్తరి అంటారు. ఈ కాలంలో కొత్త ఇంటి నిర్మాణం, శంకుస్థాపన వంటి వాస్తు సంబంధిత కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
వాస్తు కర్తరి కాలం:
2026 మే 4 నుంచి (రవి భరణి 3వ పాదంలోకి ప్రవేశం) వాస్తు కర్తరి ప్రారంభమై మే 29 (రవి రోహిణి నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశం)తో ముగుస్తుంది. ఈ కాలం తిథుల ప్రకారం.. వైశాఖ బహుళ తదియ (మే 4) నుంచి అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి (మే 29) వరకు అన్నమాట.
2026లో పుష్కరాలు:
2026, జూన్ 1 మరియు 2వ తేదీల్లో రాత్రి 12.17 గంటలకు గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ కాలంలో యమునా నదిలో స్నానమాచరించడం, దానాలు చేయడం పుణ్యప్రదమని విశ్వాసం.
పుష్కర కాలం:
2026, జూన్ 2 నుంచి జూన్ 13వ తేదీ వరకు.
శని త్రయోదశి తేదీలు:
2026 సంవత్సరంలో శని త్రయోదశి తేదీలు:
జూన్ 13, జూన్ 27, అక్టోబర్ 24, నవంబర్ 7.
2027 (ఏప్రిల్ వరకు) లో శని త్రయోదశి తేదీలు: మార్చి 6, మార్చి 20.
శుభ ముహూర్తాలు:
పరాభవ నామ సంవత్సరంలో వివాహాలు, గృహారంభం, ఉపనయనం, అన్నప్రాశన, నూతన వ్యాపారాల ప్రారంభం వంటి శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు వివిధ తేదీల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ముహూ ర్తాలు ఇవి.. సదరు ముహూర్తం ఏ కార్యానికి అనుకూలమో కూడా కింది తేదీలను బట్టి తెలుసుకోవచ్చు.
చైత్ర మాసం (2026)
మార్చి 27: వ్యాపారం
మార్చి 28: ఉపనయనం, వ్యాపారం, గృహారంభం
వైశాఖ మాసం (2026)
ఏప్రిల్ 26: వివాహం, గృహ ప్రవేశం
ఏప్రిల్ 29: వివాహం
మే 1: వివాహం, గృహారంభం
మే 3: వ్యాపారం, గృహప్రవేశం
మే 6 నుంచి 11:
ఈ రెండు తేదీల మధ్యలో అనేక వివాహ ముహూర్తాలు ఉన్నాయి
నిజ జ్యేష్ఠ మాసం (2026)
జూన్ 17 నుంచి జూలై 9 వరకు అనేక వివాహ, గృహ ప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి
శ్రావణ మాసం (2026)
ఆగస్టు 15, 16, 20, 22 (అనేక వివాహ ముహూర్తాలు)
కార్తీక మాసం (2026)
నవంబర్ 12 నుంచి 22 (అనేక వివాహ ముహూర్తాలు)
మాఘ మాసం (2027)
ఫిబ్రవరి 7 – 27 వరకు (వివాహ ముహూర్తాలు)
ఫాల్గుణ మాసం (2027)
మార్చి 10 నుంచి ఏప్రిల్ 2 వరకు (వివాహ, గృహ ప్రవేశ, వ్యాపార ముహూర్తాలు అనేకం ఉన్నాయి)
మంచి రోజులివిగో..!
2026: మార్చి: 27, 28
ఏప్రిల్: 24, 26, 29, 30
మే: 1, 3, 6, 7, 8, 9, 10, 11
జూన్: 17, 18, 19, 20, 24, 25, 27, 28, 29
జూలై: 1, 2, 3, 5, 6, 8, 9
(గురు మౌఢ్యమి కారణంగా జూలై 15 నుంచి ఆగస్టు 14 వరకు
శుభ ముహూర్తాలు లేవు)
ఆగస్టు: 15, 16, 20, 22, 27, 28, 30, 31
సెప్టెంబర్: 3, 4, 5, 6, 7
(భాద్రపదంలో వివాహ ముహూర్తాలు లేవు. వ్యాపార ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి)
అక్టోబర్: 12, 14, 16
(అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 29 వరకు శుక్ర మౌఢ్యమి కారణంగా ముహూర్తాలు లేవు)
నవంబర్: 12, 13, 15, 18, 20, 21, 22, 25, 28
డిసెంబర్: 2, 3, 5, 11, 12, 13, 17, 19, 23, 24, 30, 31
2027:
జనవరి: 1
(పుష్య మాసం కారణంగా ముహూర్తాలు లేవు)
ఫిబ్రవరి: 7, 10, 11, 20, 22, 24, 25, 27, 28
మార్చి: 10, 11, 12, 14, 15, 20, 21, 24, 26, 27, 28, 29, 31
ఏప్రిల్: 1, 2

























































































































































































































































































































































































































Review మంచి‘కాలం’.