మనమంతా బాధకు బందీలమే!

జీవితంలో మనం మాట్లాడుకునే చాలా విషయాలు, చెప్పుకునే చాలా కబుర్లు.. ఇవన్నీ మాకెందుకని అనుకుని ఏదో క్షణంలో అనుకుంటాం. కానీ, అవన్నీ ఇప్పుడు కాకపోయినా, ఎపుడైనా జీవితంలో అందరికీ అవసరమైనవే. అందుకే రాస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం. అందుకే నేను రాసే చాలా ఉత్తరాలు చూడటానికి ఇతర వ్యక్తులకు రాస్తున్నట్లు అన్పించినా, నిజానికి అవి నాకు నేను రాసుకున్న ఉత్తరాలు. ఇవన్నీ నిజానికి

శక్తి కేంద్రాలు

యోగ సాంప్రదాయం ప్రకారం మానవ దేహంలో 114 చక్రాలు ఉన్నాయి. వాటిలో ఏడు చక్రాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవి. చక్రాలు అంటే శక్తి కేంద్రాలు. మానవ శరీరంలోపల అదృశ్యంగా ఉండే శక్తి ప్రవాహాలు. ఈ చక్రాలలో కేంద్రీకరించబడి ఉంటాయి. ఈ ఏడు చక్రాలను సరైన స్థితిలో ఉంచినప్పుడు శరీరం శక్తి ప్రవాహంగా, జీవితం అనా యాసంగా నడిచి పోతున్నట్లు అనుభూతిని పొందుతారు. శరీరంలో ఉండే శక్తిని ‘‘ప్రాణం’’ అని పిలుస్తారు. ఈ

చక్కని నిద్ర.. ఆరోగ్య ముద్ర

అలసిన మనసుకు కాసింత విశ్రాంతి లభించేది నిద్రలోనే. నిద్ర సరిగా లేకపోతే ఆ మర్నాడు రోజంతా చికాకుగానే ఉంటుంది. ఏ పనిపైనా ఏకాగ్రత చూపలేం. అదే కంటి నిండా నిద్రపోతే తెల్లారి పనులన్నీ సవ్యంగా చేయగలుగుతాం. చేసే పనిపై మనసు నిలపగలుగుతాం. సరైన నిద్రలేకపోతే శారీరకంగానూ, మానసికంగానూ కూడా అనేక అనర్థాలు తలెత్తుతాయి. ఏ వయసు వారికైనా రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం చాలా పెద్ద ఆరోగ్య ప్రమా దాలకు దారి

మాతృత్వం ఓ తీయని కల

మూఢనమ్మకాలు మనిషి జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇవి తల్లి నుంచి పిల్లలకు, ఒక తరం నుంచి మరొక తరానికి క్రమం తప్పకుండా వస్తూనే వున్నాయి. ఈ మూఢనమ్మకాలను పామరులు, గ్రామీణ ప్రజలే కాకుండా విద్యా వంతులు, పట్టణ ప్రాంతాలవారు కూడా పాటిస్తున్నారు. ఆ మూఢనమ్మకాల మూలంగా మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. మహిళలు గర్భధారణ సమయంలో తెలిసీ తెలియని వారి మాటలు విని వాటిని ఆచరిస్తుంటారు.

చర్మానికి వరం చందనం

చర్మానికి నిగారింపు రావాలన్నా లేదా ముఖాన్ని మచ్చలు, గీతలు, మొటిమల నుంచి విముక్తి చేయాలన్నా చందనానికి సాటి మరోటి లేదు. కేవలం సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చందనం అమూల్యమైనది. చందనం లేదా గంధం ఒక విలువైన చెక్క. భారతదేశంలో దాన్ని అధికంగా వాడు తుంటారు. ఇది చాలా ఖరీదుగా ఉండటానికి కారణం ఈ చెట్లు నిదానంగా పెరగటమే. ఒక చెట్టు పూర్తిస్థాయిలో ఎదిగేందుకు సంవత్సరాలు పడుతుంది.

Top