మాతృత్వం ఓ తీయని కల

మూఢనమ్మకాలు మనిషి జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇవి తల్లి నుంచి పిల్లలకు, ఒక తరం నుంచి మరొక తరానికి క్రమం తప్పకుండా వస్తూనే వున్నాయి. ఈ మూఢనమ్మకాలను పామరులు, గ్రామీణ ప్రజలే కాకుండా విద్యా వంతులు, పట్టణ ప్రాంతాలవారు కూడా పాటిస్తున్నారు. ఆ మూఢనమ్మకాల మూలంగా మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. మహిళలు గర్భధారణ సమయంలో తెలిసీ తెలియని వారి మాటలు విని వాటిని ఆచరిస్తుంటారు.

చర్మానికి వరం చందనం

చర్మానికి నిగారింపు రావాలన్నా లేదా ముఖాన్ని మచ్చలు, గీతలు, మొటిమల నుంచి విముక్తి చేయాలన్నా చందనానికి సాటి మరోటి లేదు. కేవలం సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చందనం అమూల్యమైనది. చందనం లేదా గంధం ఒక విలువైన చెక్క. భారతదేశంలో దాన్ని అధికంగా వాడు తుంటారు. ఇది చాలా ఖరీదుగా ఉండటానికి కారణం ఈ చెట్లు నిదానంగా పెరగటమే. ఒక చెట్టు పూర్తిస్థాయిలో ఎదిగేందుకు సంవత్సరాలు పడుతుంది.

పిల్లలు ఏం తింటున్నారు?

ఈ కాలం పిల్లలకు అన్నం అంటే రుచించడం లేదు. స్పైసీ, జంక్‍ ఫుడ్‍ అంటే మాత్రం ‘నాలుక కోసుకుంటున్నారు’. తల్లిదండ్రులు కూడా మునుపటి మాదిరిగా ఆరోగ్యకరమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించే విషయంలో మిన్నకుండిపోతున్నారు. బలవంతంగా తినిపించడం వల్ల మేలు కన్నా చేటే ఎక్కువ చేస్తుందని భావిస్తున్నారు. దీంతో పిల్లలు ఏం తింటున్నారో?, ఏం జీర్ణం చేసుకుంటున్నారో? ఎలా పెరుగుతున్నారో అనే పట్టింపే ఎవరికీ లేకుండా పోతోంది. దీని ఫలితంగానే చిన్న

పత్రం..ఆరోగ్యం ‘భద్రపదం’

వినాయక చవితి నాడు ముఖ్యంగా ఇరవై ఒక్క (21) రకాల పత్రులతో వినాయకుడిని పూజిస్తారు. వినాయక చవితి పూజలో పూల కంటే పత్రాలకే ప్రాముఖ్యం ఎక్కువ. ఈ పత్రాలన్నీ మంచి ఓషధీ గుణాలు కలవి. అందుకనే మన పూర్వీకులు ఆలోచించి, అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి గాను వీటిని పూజా ద్రవ్యాలుగా నిర్ణయించారు. జీవితంలో వేగం పెరగడంతో పండుగలు కూడా తూతూ మంత్రంగా సాగిపోతున్నాయి. ప్రస్తుతం పచ్చగా కనిపించే ప్రతి గడ్డినీ

ఆరోగ్యదాయక శ్రావణం

ఈ భూమిని సస్యశ్యామలం చేసే మాసం శ్రావణ మాసం. మన పెద్దలు ఆయా మాసాల వాతావరణాన్ని బట్టి ఏం తినాలి? ఏం చేయాలి? ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? అనే క్రమం ఏర్పరిచారు. అటువంటి నియమాలు పాటించాల్సిన మాసాల్లో శ్రావణ మాసం మొదటిది. ఈ మాసం దక్షిణాయనంలో వర్ష రుతువు మొదటి మాసం. దక్షిణాయనం వర్షాకాలం. అంటే జబ్బుల కాలం. ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసంలో నియమాలు ఎక్కువగా పాటించాలి.

Top