కృష్ణగారడి.. గణపతి సందడి

2023- సెప్టెంబరు 1, శుక్రవారం, శ్రావణ బహుళ విదియ నుంచి 2023- సెప్టెంబరు 30, శనివారం, భాద్రపద బహుళ పాడ్యమి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం-శ్రావణం - భాద్రపదం - వర్షరుతువు-దక్షిణాయణం ఆంగ్లమానం ప్రకారం తొమ్మిదవ మాసం సెప్టెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం. శ్రావణ మాసంలోకి కొన్ని రోజులు, భాద్రపదంలోని మరికొన్ని రోజుల కలయిక.. ఈ మాసం. సెప్టెంబరు 1, శ్రావణ బహుళ విదియ నుంచి సెప్టెంబరు 15 శ్రావణ బహుళ అమావాస్య వరకు

ఉత్తరాయణం

జీవిత ధన్యత తెలుగు పత్రిక ఆగస్టు 2023 సంచికలో ముఖచిత్రం కింద అందించిన ‘సిరి దేవత’ కథనం డిఫరెంట్‍గా ఉంది. లక్ష్మీదేవి గురించి మంచి విషయాలు తెలియపరిచారు. అలాగే, జీవితానికి ధన్యత కలిగించేది సంపద కాదు.. ఆధ్యాత్మిక సాధన అనే విషయాన్ని భక్త తుకారాం కథ ద్వారా చాలా గొప్పగా, స్పష్టంగా, సరళంగా చెప్పారు. - ఎన్‍.బాలచంద్ర, రాజశేఖర్‍, రాజేశ్‍, ఈశ్వరప్రసాద్‍, కె.రామచందర్‍రావు హైదరాబాద్‍, ఉమాశంకరప్రసాద్‍, రాజ్యలక్ష్మి, సురేశ్‍ మరికొందరు పాఠకులు భారత కథలు భారతంలో

కృష్ణుడి అల్లరి.. గణపతి ఆకలి

అప్పుడప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టిన బుల్లి కృష్ణుడు.. నడుస్తూ నడుస్తూ దబ్బున పడతాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి విబూది పూతలా మారింది. ఉంగరాల జుత్తును పైకి దువ్వి, ముత్యాలహారంతో వేసిన ముడి చంద్రవంకలా ఉందట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రటి తిలకం ఫాలనేత్రంతా, రత్నాలహారంలో నాయకమణిలా ఉన్న నీలమణి శివుడి కంఠాన ఉన్న నల్లటి మచ్చలా, మెడలోని ముత్యాలహారాలు సర్పహారాల్లా అనిపించి.. బాలకృష్ణుడు అచ్చు శివుడే అనిపించాడట!. ఒకసారి పాలు తాగడానికి

పరమపద సోపాన ‘పాఠం’

పరమపద సోపాన పథము లేదా వైకుంఠపాళీ లేదా పాము-నిచ్చెన ఆట.. లేదా మోక్షపథం.. మోక్షపటం..లేదా పాము పటం.. పేరేదైనా ఇదో ప్రాచీన భారతీయ ఆట. మన తెలుగు నాట ఇది మరీ సుప్రసిద్ధం. ఇది మానవ జీవితాల్లోని ఆధ్యాత్మిక కోణాన్ని వెలికితీస్తుంది. జీవితంలో మనిషి ఎదుర్కొనే కష్టనష్టాలకు, చివరకు చేరుకోవలసిన గమ్యానికి ప్రతీకగా నిలిచే ఆట ఇది. పాశ్చాత్యులు దీనిని ‘క్లాసిక్‍ ఆట’గా పరిగణిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఆడాల్సిన ఆటగా మన పెద్దలు చెబుతుంటారు. మన పురాణాలు,

పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక సాధిస్తాం! తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివ్వెలం చేయిచేయి కలుపుతాం చెలిమితోడ మెలగుతాం జాతి గీతి పాడుతాం చదువులన్నీ చదువుతాం క్రమశిక్షణ పాటిస్తాం శ్రమదానం సాగిస్తాం పరిశుభ్రతను పాటిస్తాం ప్రగతిబాట పయనిస్తాం చక్కటి పాదులు చేసేస్తాం మొక్కలు ఎన్నో నాటేస్తం పచ్చదనాన్నే తెచ్చేస్తాం ప్రకృతి అందం పెంచేస్తాం స్నేహసుధలనే చిందిస్తాం శాంతిని

Top