అమ్మ.. చల్లని పూలకొమ్మ
అమ్మ లేదని కొందరికి బాధ. అమ్మ ఉందని మరికొందరికి వ్యధ. ఎంతటి వ్యత్యాసం? ఎంతటి దౌర్భాగ్యం?.. అమ్మలేని కొందరి జీవితాలను పరిశీలిస్తే కళ్లలో నీళ్లు ఘనీభవించి కళ్లు మసకబారిపోతాయి. అమ్మ ఉన్న కొందరి ఉన్మాదుల జీవితాలను చూస్తే గుండె రగిలిపోతుంది. ఇంతటి ఘోరాతి ఘోరమా అని రక్తం ఉడికిపోతుంది. రెండు సంవత్సరాల క్రితం అమ్మ సేవలకు గంటల ప్రకారం లెక్కలు కట్టారట. ఆమె సేవలకు కట్టిన విలువ ఎంత తెలుసా?




