పానకం-వడపప్పు తయారీ

శ్రీరామ నవమి రోజున పానకం - వడపప్పును భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ ప్రసాదం వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. శ్రీరామ నవమి నాటికి వేసవి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో పానకం - వడపప్పును ప్రసాద రూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షుతో పాటు అలసట తీరుతుందని పండితుల అభిప్రాయం. మన దేవతా ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం

భలే మంచి రోజు..

అన్ని రోజులూ మంచివే. రోజులు, సంవత్సరాలు మంచివి, చెడ్డవి అనే వ్యత్యాసంతో ఉండవు. ‘వచ్చే సంవత్సరం కలిసొస్తుంది..’, ‘రేపు మంచి జరుగుతుంది...’ ఇటువంటి భావనలన్నీ ఆశతో బతకడానికి పనికొస్తాయి కానీ, ఆశయంతో జీవించాలంటే మాత్రం ఆశకు తోడు విశ్వాసం కావాలి. మనం జీవించే ప్రతి క్షణం మంచిది కావాలంటే, మంచిగా మలుచుకోవాలంటే.. ముందు మన మనసు శుద్ధి కావాలి. మన మనసులోని భావాలు, భావనలు మంచివై ఉండాలి. అప్పుడు

‘ఆది’పర్వం… ఉగాది ఆనందోత్సవం

అచ్చమైన తెనుగు పర్వం- ఉగాది. ఉగాది నుంచే కొత్త సంవత్సరం మొదలవుతుంది. మన తెలుగు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఈ సంవత్సరానికి వికారి నామ సంవత్సరం అని పేరు (ఏప్రిల్‍ 6, 2019). ఇది మన తెలుగు వారి మొదటి పండుగ. ఈ రోజు ప్రతి ఒక్కరు తమ రాశి ఫలాలు, గ్రహ స్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తదనుగుణంగా సంవత్సరమంతా మసులుకుంటారు. ఈ పర్వం

రామ ధర్మం… మా’నవ’ ధర్మం

ఆధ్యాత్మికతతో ముడిపడిన అవతారాలన్నీ మనిషి మనసులో కేవలం భక్తిని ప్రేరేపిస్తే, రాముని అవతారం మాత్రం ప్రతి మనసులో గుడి కట్టుకుని, ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. మునుముందు సంఘంలో మానవ మనస్తత్వ చిత్రణ శ్రీరామునిలా ఉండాలని, తద్వారా సంఘం ఉత్తమంగా రూపుదిద్దుకోవాలన్న సంకల్పంతో బహుశా వాల్మీకి మహర్షి రామాయణ రచన చేశాడేమో! రాముడిని దేవుడిలా కాదు.. మానవుడిలా చూస్తే.. ఈ భూమిపై మనిషిలా ఎలా బతకాలో తెలిసి వస్తుంది.

కళారత్న మల్లం రమేష్‍కు ఘనస్వాగతం పలుకుతున్న అమెరికా

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మిమిక్రీ కళా కారుడు, వెంట్రిలాక్విస్ట్, కళారత్న మల్లం రమేష్‍ ‘ఉగాది ఉత్సవాలు’ సందర్భంగా అమెరికా రానున్నారు. 2019 ఏప్రిల్‍ 4న పోర్ట్లాండ్‍ నగరానికి చేరుకుని తదుపరి నార్త్ టెక్సాస్‍, న్యూజెర్సీ తదితర ప్రాంతాలలో సాంస్క•తికపరంగా పర్యటిస్తారు. ఏప్రిల్‍ 13న నార్త్ టెక్సాస్‍లో జరిగే ఉగాది ఉత్సవాలలో పాల్గొంటారు. మరికొన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్‍ డాక్టర్‍ నేరెళ్ల వేణు మాధవ్‍ శిష్యుడైన

Top