విరాట్‍కు ప్రభాస్‍ గిఫ్ట్…

విరాట్‍కు ప్రభాస్‍ గిఫ్ట్..‘బాహుబలి’ తరువాత ప్రభాస్‍కు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరిగారు. ఈ జాబితాలో ప్రముఖ నటుల వారసులూ ఉండటం విశేషం. ఇటీవల విరాట్‍ అనే చిన్నారికి ‘బాహుబలి’లో తాను వాడిన కత్తిని పోలిన కత్తిని తయారు చేయించి బహుమతిగా ఇచ్చాడు ప్రభాస్‍. దీంతో విరాట్‍ ఎవరనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఆరా తీస్తే.. ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్‍ ముని మనవడని తేలింది. అంటే, శివాజీ గణేశన్‍ కుమారుడు

చితగ్గొడతా..

జూనియర్‍ ఎన్టీఆర్‍ క్రేజీ ప్రాజెక్ట్ ‘జై లవకుశ’పై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‍ మూడో పాత్ర ఏమిటో అందరికీ తెలిసిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‍ మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములుగా నటిస్తున్న ఆయన పాత్రకు సంబంధించి ‘జై’, ‘లవ్‍’ పాత్రల టీజర్లు విడుదలయ్యాయి. తాజాగా ‘కుశ’ పాత్రకు సంబంధించిన టీజర్‍ ఇటీవల విడుదలైంది. టీజర్‍లో ఉన్న సన్నివేశాలు, అందులో జూనియర్‍ ఎన్టీఆర్‍ పలికిన

నాగార్జున తీరని కోరిక

టాలీవుడ్‍ మన్మథుడు నాగార్జున తన తీరని కోరికను ఇటీవల బయట పెట్టారు. అది- రాజమౌళి దర్శకత్వంలో నటించడం. ‘రాజమౌళి దర్శకత్వంలో పని చేయాలనేది కోరికగానే మిగిలిపోయింది. అప్పుడెప్పుడో ‘రాజన్న’ చిత్రానికి రాజమౌళి కొన్ని సన్నివేశాలకు దర్శకత్వం వహించినా అది ఆయన పూర్తి స్థాయి దర్శకత్వం వహించిన చిత్రం కాదు. ఇంకోసారి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఏమైతేనేం. నాన్న గారి పేరుతో ఉన్న ఏఎన్నార్‍ జాతీయ అవార్డును ఈ

‘సైరా’ చిరంజీవ

మెగాస్టార్‍ చిరంజీవి ‘ఖైదీ నంబర్‍ 150’ తరువాత తీయబోయే చిత్రం ఖరారైంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‍ విడుదల చేశారు. భారతీయ సినీ పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన అగ్రగణ్యులైన నటులు ఇందులో నటించబోతున్నారు. ‘బిగ్‍ బీ’ అమితాబ్‍ బచ్చన్‍, నయనతార, కన్నడ సుదీప్‍, విజయ్‍ సేతుపతి, జగపతిబాబు వంటి హేమాహేమీలు ఇందులో మెగాస్టార్‍ చిరంజీవితో కలిసి తెర పంచుకోనున్నారు. రాయలసీమకు చెందిన

‘ఎడమ చేయి మాట వినదు’

చదవడానికి ‘చిత్రం’గా ఉన్నా.. సరిగ్గా ఇదే కథాంశంతో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఆసక్తికరంగా ఉంది కదూ!. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ అనే సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఇందులో పాత్రపరంగా నాగచైతన్య ఎడమ చేయి తన మాట వినదు. అంటే అతని మెదడుకీ ఎడమ చేతికీ సంబంధం తెగిపోతుందన్న మాట. ఈ నేపథ్యంలో కథా నాయకుడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనే కథే ‘సవ్యసాచి. కమర్షియల్‍ అంశాలతో ఈ సినిమా

Top