సీతాఫలంలో పోషకాలు

మీరు ఏ సీజన్‍లో వచ్చే ఫ్రూట్స్ను ఆ సీజన్‍లో మిస్సవకుండా తింటుంటారా..? తింటే మంచి అలవాటే..అదే తినకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేయండి.. ఎందుకంటే ఒక్కో పండులో ఒక్కో పోషక విలువ ఉంటుంది.. అదే కోవకు చెందింది మన సీతాఫలం.. రుచిలో ఎంత తియ్యగా ఉంటుందో.. అంతకు మించి పోషకాలు ఈ పళ్లల్లో ఉంటాయి. సీజన్‍లో మాత్రమే లభించే ఈ ఫలం తింటే జీర్ణక్రియ చక్కగా జరిగేందుకు తోడ్పడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉండడమే కాక స్కిన్‍ ఎలర్జీల నుంచి తట్టుకునేందుకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం, ఆస్తమా వ్యాధులకు సీతాఫలం దివ్య ఔషధం. సీతాఫలం ఎక్కువగా తింటే ప్రేగులను శుభ్రపరిచి రక్తం శుద్ధి అవుతుంది. ఉదరంలో నులి పురుగులను చంపి గుండెను బలంగా చేస్తుంది. కొలెస్ట్రాల్‍ శాతాన్ని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మెదడు, నరాల సమస్యలు రాకుండా చేస్తుంది. శీతాఫలం తరచూ తినేవాళ్లలో దంతక్షయ సమస్యలు కూడా ఉండవని తాజా పరిశోధనల్లో తేలింది.

Review సీతాఫలంలో పోషకాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top