పుణ్యాధిక మాసం

2023- జూలై 1, శనివారం, ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి 2023- జూలై 31, సోమవారం, శ్రావణ (అధిక) శుద్ధ త్రయోదశి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం-ఆషాఢం-శ్రావణం (అధిక)-వర్షరుతువు-దక్షిణాయణం ఆంగ్లమానం ప్రకారం ఏడవ నెల జూలై. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ - శ్రావణ (అధిక) మాసాల కలయిక. ఆషాఢ మాసంలోని కొన్ని రోజులు, శ్రావణ (అధిక) మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. ఆషాఢాన్ని శూన్య మాసమని, శుభప్రదమైనది కాదని

ఉత్తరాయణం

ఆరోగ్య భాగ్యం తెలుగు పత్రిక జూన్‍ 2023 సంచికలో ఆరోగ్యభాగ్యం శీర్షిక కింద అందించిన అశ్వగంధ ఆయుర్వేద ఔషధ మొక్క గురించిన వివరాలు బాగున్నాయి. నిజానికి వైద్యం నేటి ఆధునికతను సంతరించుకోక ముందు మన పెరటి మొక్కలే మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవనడానికి అశ్వగంధ ఒక ఉదాహరణ. - సీ.కే.రామబ్రహ్మం, కవితాప్రసాద్‍, నాగరాజారావు, మరికొందరు హైదరాబాద్‍ నుంచి విష్ణు నామాలు తెలుగు పత్రిక జూన్‍ 2023 సంచికలో విష్ణు సహస్ర నామాల్లోని కొన్ని నామాల గురించి, వాటి

ఓం గురుభ్యోనమ:

గురువు అంటే..గౌరవమైనది, గొప్పది అని అర్థం. గురువు అనే శబ్దం మనలోని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. మనలో ఏళ్ల తరబడి పిడచకట్టుకొనిపోయిన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే మహత్తర శక్తి గురువు. భారతదేశం యుగయుగాలుగా గురువును గొప్ప దృష్టితో చూస్తోంది. ధర్మదండాన్ని గురువు చేతికిచ్చి దేశ ధర్మాన్ని నడిపించాలని కోరిన ఘటన భారతీయులది. గురువులు కూడా పలు రకాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆవపోసన పట్టిన గురువులు కొందరు.. రాజనీతి సామాజిక బాధ్యతను తమ

మూర్తి’ చిన్నది కీర్తి గొప్పది

మన ఉపనిషత్తుల్లో అతి చిన్నది- కైవల్యోపనిషత్తు. కానీ, ఇది బోధించే విషయం మాత్రం చాలా పెద్దది. ఇది అథర్వణ వేదంలో ఉంది. స్వయంగా అనేక మంత్రాలను వేదాల్లో చేర్చగలిగిన సామర్థ్యమున్న అశ్వలాయన మహారుషి అడిగిన ప్రశ్నలకు చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చిన సమాధానాల సారమే ఈ ఉపనిషత్తు. శుద్ధ ఆత్మతత్త్వం ఈ ఉపనిషత్తులోని ముఖ్యాంశం. సాధారణంగా భోజన సమయాల్లోనూ, ఇతరత్రా తీరిక వేళల్లో భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పఠించడం చాలామందికి అలవాటు. అయితే,

నామం పెట్టడం.. టోపీ వేయడం

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి

Top