తిథి ప్రత్యేకం

త్రిమూర్తి స్వరూపంగా కొలువుదీరి, భక్తుల కోర్కెలను ఈడేర్చే స్వామిగా నిత్య పూజలు అందుకుంటున్నాడు అన్నవరంలో వెలసిన అనంతలక్ష్మీ సత్యవతీ సమేత శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి. ఈ స్వామి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్నా.. అన్నవరంలో నవ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినా.. వైవాహిక బంధంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే స్వామి కల్యాణోత్సవం (2026, ఏప్రిల్‍ 27, వైశాఖ శుద్ధ ఏకాదశి, సోమవారం) చూసి

శ్రీరామ్‍ గారి లేఖలు

నా ప్రియమైన చెల్లాయికి.. మిగతా వ్యక్తుల విషయం తెలియదు కానీ.. నా మటుకు నాకు ఒంటరితనం ఎన్నో పాఠాలను నేర్పింది. అసలు నేను నేర్చుకున్నదంతా ఒంటరితనంలోనే. నా మనసు తుంటరితనం మాయమయ్యేది ఒంటరితనంలోనే. మనస్సును ఆక్రమించే ‘మాయ’ మూగబోయేది ఒంటరితనంలోనే. స్నేహితులపై ఎవరికి ఎంత ప్రేమ ఉంటుందో - నాకు ఒంటరితనమంటే అంత కన్నా ఎక్కువ ప్రేమ. నా పుట్టిన రోజున కూడా ఒంటరిగా ఉండటమే అలవాటు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒంటరితనం

పాఠలే.. పాఠమై..

పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ , జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు.. బిడ్డలు కొంచెం ఎదిగాక గోరుముద్దలు, గొలుసు ముద్దలు తినిపిస్తూ చందమామ ముచ్చట్లు చెబుతూ తల్లులు చందమామ పాటలు పాడతారు. చందమామ రావె జాబిల్లి రావె కొండెక్కి రావె గోగుపూలు తేవె అని పాడుతూ మారాము చేస్తున్న బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది తల్లి. ఇలా చేయడం

మాసం.. విశేషం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర - వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు ఉంటాయి. ఏప్రిల్‍ 17వ తేదీ, శుక్రవారం వరకు చైత్ర మాస తిథులు.. ఆపై ఏప్రిల్‍ 18, శనివారం నుంచి వైశాఖ మాస తిథులు కొనసాగుతాయి. ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారి రథోత్సవం, హనుమజ్జయంతి, వరూధునీ/సర్వ ఏకాదశి,

ఉత్తరాయణం

ఉగాది ఆస్థానం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో జరిగే ఉగాది ఆస్థానం గురించి తెలుగుపత్రిక 2026, మార్చి సంచిక ముఖచిత్ర కథనాన్ని చదివిన తరువాతే తెలుసుకున్నాం. శ్రీనివాసుడు తన సన్నిధిలో జరుపుకునే ఈ సంవత్సరాది పర్వపు ఆచారాలను, విశేషాలను ఎంతో బాగా కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆ వేడుకను కనులారా తిలకించే భాగ్యం లేకపోయినా.. ఆ వేడుక జరిగే విధానాన్ని నేత్రపర్వం చేస్తూ మంచి కథనాన్ని అందించారు. -వెంకటరమణ-హైదరాబాద్‍, కిశోర్‍కుమార్‍- విశాఖపట్నం,

Top