ఈ శుభ మాసంలో..

ఆంగ్లమానం ప్రకారం ఎనిమిదవ మాసం ఆగస్టు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ (అధిక)- శ్రావణ మాసాల కలయిక. ఈసారి శ్రావణం అధికమాసంతో కూడి వచ్చింది. పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఇలా జంట శ్రావణ మాసం అధిక మాసంతో కూడి వస్తుంది. ఆగస్టు 16, బుధవారం వరకు శ్రావణ (అధిక) మాస తిథులు, ఆపై ఆగస్టు 17, గురువారం, శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ మాస తిథులు కొనసాగుతాయి.

ఉత్తరాయణం

మూర్తి..కీర్తి తెలుగు పత్రిక జూలై 2023 సంచికలో ముఖచిత్రం కింద అందించిన ‘మూర్తి చిన్నది.. కీర్తి గొప్పది’.. అంటూ కైవల్యోపనిషత్తు గురించి అందించిన వివరాలు బాగున్నాయి. మానవ జన్మకు పరమ గమ్యమైన మోక్షాన్ని అత్యంత సరళంగా, సులభంగా బోధించిన ఈ ఉపనిషత్తు నిత్య పఠనీయమని చెప్పడం బాగుంది. - ఈశ్వరచంద్ర- హైదరాబాద్‍, కేఎస్‍ ప్రభాకర్‍- తిరుపతి, రామచంద్రం- విజయవాడ, రాంప్రసాద్‍, కె.ప్రభ, రవిశంకర్‍, మరికొందరు పాఠకులు పంచతంత్ర కథలు తెలుగు పత్రిక

చక్కని బుద్ధి.. లక్ష్మీసిద్ధి!

సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతోనే కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తారు. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తారు. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వ్రతం కూడా అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జగన్మాత పార్వతి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వ్రతం ఏదైనా ఉందా? అని

పలుకు తేనెల తల్లి!

సిరి దేవత లక్ష్మీదేవి గురించి తెలుసుకునే ముందు ఓ చిన్న కథ చెప్పుకుందాం. భారత యుద్ధం ముగిసింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పరుండి అంతిమ ఘడియల కోసం ఎదురు చూస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలా ప్రాణాలను నిలుపుకోవాలనే తలంపుతో ఉన్నాడు. కృష్ణుడు, ధర్మరాజు తదితరులు ఆయన వద్ద విచార వదనాలతో నిల్చున్నారు. అక్కడ రాజ్యమేలుతున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ.. ‘ధర్మనందనా! భీష్ముడు రాజనీతిజ్ఞుడు. లోకం పోకడ తెలిసిన మనిషి. సకల ధర్మాలూ తెలిసిన

విష్ణుశర్మ – పంచతంత్ర కథలు

పూర్వం గంగానదీ తీరాన గల పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులు చదువు మీద శ్రద్ధ చూపకుండా ఎప్పుడూ ఆటపాటలతో కాలం గడిపేవారు. కొడుకులు ఇలా సోమరులు కావడం సుదర్శనుడికి బాధ కలిగించింది. వారికి చదువుసంధ్యలు నేర్పించాలని తలచి ఆయన తన పట్టణంలోని విష్ణుశర్మ అనే గురువుకు కబురు పెట్టారు. విష్ణుశర్మ రాగానే, రాజు తన బాధ చెప్పుకున్నాడు. ‘నా

Top