చిన్న పిల్లల కథలు.. మళ్లీ చెబుదాం
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది..’’ కథలోని ఈ విషయం చెప్పగానే పిల్లలకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అంతేకాదు, వాళ్ల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్లు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక.. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఈ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. అయితే,




