1528-2019 రాం మందిర్ – సీదు వివాదం 500 ఏళ్ళు

కాస్త అటూ ఇటూగా తొమ్మిది సంవత్సరాలు తక్కువ కావచ్చు గాక.. కానీ, అచ్చంగా, అక్షరాలా ఐదు వందల సంవత్సరాల వివాదం- రామజన్మభూమి – బాబ్రీ మసీదు సమస్య. దేశ ముఖచిత్రాన్నే మార్చేసిన, కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమైన ఈ వివాదంపై నూట యాభై సంవత్సరాల క్రితమే మత ఘర్షణలు చెలరేగాయి. ఇక్కడి వివాదాస్పద స్థలంపై నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందటే న్యాయస్థానాలకు సమస్య చేరింది. డెబ్బై సంవత్సరాల క్రితం.. ఎదురుదాడి మొదలైంది. ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఉద్యమ చరమాంకంలో హింస రేగింది. చివరకు 2019, నవంబరు 9న ఈ వివాదానికి భారత సర్వోన్నత న్యాయస్థానం సామరస్యపూర్వకమైన తీర్పునిచ్చింది. యావత్తు భారతావని ముక్తకంఠంతో ఈ తీర్పును స్వాగతించింది. భారతదేశ చరిత్రలోనే ఏకధాటిగా దాదాపు నలభై రోజులుగా రోజూ వాదోపవాదాలతో నడిచిన ఈ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వివాదాస్పదన 2.77 ఎకరాల భూమి రాముడికే చెందుతుందంటూ, అయోధ్య రాముడిదేనంటూ వెలువరించిన తీర్పు చరిత్రాత్మకం. ఈ నేపథ్యంలో మందిర్‍ – మసీదు వివాదం నేపథ్యమిదీ..

1528: మొఘల్‍ చక్రవర్తి బాబర్‍ కమాండర్‍ మిర్‍ బక్వీ బాబ్రీ మసీదును నిర్మించారు.
1611: రాముడి కోట, ఇళ్లను భక్తులు సందర్శించే వారని తన రాతల్లో నమోదు చేసిన ఇంగ్లిష్‍ వ్యాపారి విలియం ఫించ్‍.
1717: మసీదు స్థలాన్ని కొనుగోలు చేసి రాముడికి దఖలు చేసిన రాజ్‍ఫుత్‍ వంశీకుడు జైసింగ్‍-2. మసీదు బయట రాముడి విగ్రహాలకు పూజలు.
1768: బాబ్రీ మసీదును ఔరంగజేబు నిర్మించారని కొందరు.. బాబర్‍ కట్టించాడని కొందరు స్థానికులు చెప్పినట్టు రికార్డుల్లో నమోదు చేసిన జెసూట్‍ పూజారి జోసెఫ్‍ టీఫెన్ట్హాలర్‍.
1853: బాబ్రీ – మందిర్‍ వివాదంపై దేశంలో తొలిసారి చెలరేగిన మత ఘర్షణలు.
1859: బాబ్రీ మసీదు ప్రాంతంలో హిందు వులు – ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు కంచె రూపంలో వేర్వేరు ప్రాంతాలను కేటా యించిన బ్రిటిష్‍ ప్రభుత్వం. సుమారు ముప్పై ఏళ్ల పాటు కొనసాగిన ఈ పద్ధతి.
1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్‍ కోర్టులో మహంత్‍ రఘు బీర్‍ దాస్‍ దాఖలు చేసిన పిటిషన్‍ కొట్టివేత.
1949: డిసెంబరు 22- 23 తేదీల మధ్యలో బాబ్రీ మసీదు లోపల రాముడి విగ్రహాలు ప్రత్యక్షం. హిందువులు వీటిని స్వయంభూగా భావించారు. పూజలు ప్రారంభం.. విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టారనేది కొందరి ఆరోపణ.
1950: విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతివ్వాలని ఫైజాబాద్‍ కోర్టును కోరిన గోపాల్‍ విశారద్‍, పరమహంస రామచంద్ర దాస్‍.
1959: వివాదాస్పద స్థలాన్ని తమ అధీనం చేయాలని కేసు వేసిన నిర్మోహి అఖాడా.
1961: బాబ్రీ మసీదులోని విగ్రహాలను తొల గించడంతో పాటు వివాదాస్పద స్థలం తమకు చెందినదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించిన యూపీ సెంట్రల్‍ సున్నీ వక్ఫ్ బోర్డు.
1984: రామ జన్మభూమి ఉద్యమాన్ని ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్‍ (వీహెచ్‍పీ).
1986: రామ్‍లల్లా విగ్రహాలకు పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ ఫైజా బాద్‍ సెషన్స్ కోర్టు తీర్పు. నిరసన తెలిపేందుకు బాబ్రీ మసీద్‍ యాక్షన్‍ కమిటీ ఏర్పాటు.
1989: అలహాబాద్‍ హైకోర్టుకు స్థల వివాదం. వివాదాస్పద స్థలానికి సంబంధించి యథాతథ థ్తి కొనసాగించాలని ఆదేశం.
1989: నవంబరు 9న వివాదాస్పద రామ జన్మ భూమి స్థలం సమీపంలో శిలాన్యాస్‍ నిర్వ హించేందుకు వీహెచ్‍పీకి అనుమతిస్తూ అప్పటి రాజీవ్‍గాంధీ ప్రభుత్వం నిర్ణయం.
1990: భవ్య రామ మందిరం నిర్మాణమే లక్ష్యంగా గుజరాత్‍లోని సోమనాథ్‍ నుంచి బీజేపీ నేత ఎల్‍కే అద్వానీ రథయాత్ర ప్రారంభం.
1992: డిసెంబరు 6న కర సేవకుల చేతుల్లో నేలమట్టమైన మసీదు.. చెలరేగిన వివాదం.
1992: డిసెంబరు 16న బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై విచారణకు జస్టిస్‍ లిబర్‍హాన్‍ కమిషన్‍ ఏర్పాటు.
1993: రామజన్మభూమి తాలూకు వివాదాస్పద స్థలంతో పాటు పరిసరాల్లోని 67 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న పీవీ నరసింహారావు నేతృత్వం లోని ప్రభుత్వం.
1994: స్థల స్వాధీనానికి సుప్రీంకోర్టు సమర్థింపు. ఇస్లాం మతంలో మసీదు ఒక భాగం కాదంటూ డాక్టర్‍ ఇస్మాయిల్‍ ఫారూఖీ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు వ్యాఖ్య.
2002: వివాదాస్పద రామ జన్మభూమి స్థల యాజమాన్య హక్కులపై అలహాబాద్‍ హైకోర్టులో విచారణ ప్రారంభం.
2003: కేంద్రం స్వాధీనం చేసుకున్న భూమిలో మతపరమైన కార్యకలాపాలపై సుప్రీంకోర్టు నిషేధం.
2005: వివాదాస్పద స్థలంపై పేలుడు పదా ర్థాలు నిండిన జీపుతో ఉగ్రవాదుల దాడి. ఎదురు కాల్పుల్లో అందరూ హతం.
2009: ప్రభుత్వానికి జస్టిస్‍ లిబర్‍హాన్‍ కమిషన్‍ నివేదిక సమర్పణ.
2010: సెప్టెంబరు 30న సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్‍లీలా, నిర్మోహి అఖా•కు సమానంగా వివా దాస్పద 2.77 ఎకరాలను విభజించాలని అలహా బాద్‍ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశం.
2011: అలహాబాద్‍ హైకోర్టు తీర్పును సవాల్‍ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలు. హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు.
2017: అయోధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు చీఫ్‍ జస్టిస్‍ జేఎఫ్‍ ఖేహార్‍ సూచన.
2017: సుప్రీంకోర్టు చీఫ్‍ జస్టిస్‍ జస్టిస్‍ దీపక్‍ మిశ్రా, జస్టిస్‍ అశోక్‍ భూషణ్‍, జస్టిస్‍ అబ్దుల్‍ నజీర్‍ లతో కూడిన త్రిసభ్య బెంచ్‍ విచారణ ప్రారంభం.
2018: 1994 నాటి ఇస్మాయిల్‍ ఫారూఖీ తీర్పును పున: పరిశీలించాలన్న పిటిషనర్ల అప్పీ ళ్ల••• విచారించిన సుప్రీంకోర్టు. విషయాన్ని విస్త•త ధర్మాసనానికి నివేదించాలంటూ 2:1 తేడాతో న్యాయమూర్తుల తీర్మానం.
2019: జనవరి 8న అయోధ్య వివాదంపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. చీఫ్‍ జస్టిస్‍ రంజన్‍ గొగోయ్‍ నేతృత్వంలో జస్టిస్‍ శరత్‍ అరవింద్‍ బాబ్డే, జస్టిస్‍ ఎన్‍వీ రమణ, జస్టిస్‍ యు.యు. లలిత్‍, జస్టిస్‍ డీవై చంద్రచూడ్‍లతో ధర్మాసనం ఏర్పాటు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్క రించుకోవాలని చీఫ్‍ జస్టిస్‍ సూచన.
2019: జనవరి 10.. విచారణ బెంచ్‍లో తాను ఉండరాదని యు.యు.లలిత్‍ నిర్ణయం. దీంతో బెంచ్‍ పునర్‍వ్యవస్థీకరణ. జస్టిస్‍ ఎన్‍వీ రమణ, జస్టిస్‍ లలిత్‍ల స్థానంలోకి జస్టిస్‍ అశోక్‍ భూషణ్‍, జస్టిస్‍ ఎస్‍.అబ్దుల్‍ నజీర్‍ చేరిక.
2019: మార్చి 8.. కోర్టు పర్యవేక్షణలో ఉండే మధ్యవర్తిత్వ కమిటీకి వివాదాస్పద అంశం అప్పగింత.
2019: ఆగస్టులో సమస్యను సామరస్యంగా పరిష్కరించే విషయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‍ ఎఫ్‍.ఎం.ఐ.ఖలీఫుల్లా నేతృత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీ విఫలం. ఈ కమిటీలో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‍ కూడా సభ్యులు. సుప్రీంకోర్టు విధించిన గడువు కంటే ముందే ఈ కమిటీ నివేదిక సమర్పించి సమస్య పరిష్కార బాధ్యతల నుంచి తప్పుకుంది.
2019: ఆగస్టు 6 నుంచి అయోధ్య అంశంపై రోజు వారీ విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు.
2019: అక్టోబర్‍ 16న తుది తీర్పు రిజర్వ్.
2019: నవంబరు 9.. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు. వివాదాస్పద 2.77 ఎకరాలను 3 భాగాలుగా పంచాలన్న అలహాబాద్‍ హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యం కాదని.. మొత్తం మూడు భాగాల స్థలం యాజ మాన్య హక్కులు రామ్‍లల్లాకే చెందుతాయని తీర్పు. తీర్పును స్వాగతించిన భారతావని.

‘అయోధ్య’ కొలిక్కి.. ‘బాబ్రీ’ కేసు ఎప్పటికి

రామజన్మభూమి – బాబ్రీ మసీదు స్థల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జాతి ముక్తకంఠంతో ఆమోదించింది. శతాబ్దాల వివాదానికి తెరపడినట్టే.. మరి, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి లఖ్‍నవూ సీబీఐ కోర్టులో ఉన్న కేసు సంగతే ఏమిటనేదే ఇప్పుడు అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. త్వరలో ఈ కేసు తీర్పు కూడా వెలువడనుంది. 27 ఏళ్ల నాటి ఈ కేసు పూర్వాపరాలివీ..
1992, డిసెంబరు 6న కొందరు అయోధ్యలోని బాబ్రీ మసీదును కూలగొట్టారు. దీనికి సంబంధించి నమోదైన కేసు ఎఫ్‍ఐఆర్‍లో ఎల్‍కే అద్వానీ, అశోక్‍సింఘాల్‍, ఉమాభారతి, వినయ్‍ కటియార్‍, విష్ణుహరి దాల్మియా, సాధ్వీ రితంభర తదితరుల పేర్లున్నాయి. ఈ కేసు నింది తుల్లో ఇప్పటికే 49 మంది కన్నుమూశారు.
1993, అక్టోబరు 5న 49 మందిపై లఖ్‍నవూ సీబీఐ కోర్టులో చార్జి షీటు దాఖలైంది.
2003, జనవరి 27న సీబీఐ.. రాయ్‍బరేలీ కోర్టును ఆశ్రయించి, ప్రముఖులపై నమోదైన కేసు విచారణను కొనసాగించాలని కోరింది.
2003, సెప్టెంబరు 19న రాయ్‍బరేలీ స్పెషల్‍ మేజిస్ట్రేట్‍ విద్వేష పూరిత ప్రసంగం కేసు నుంచి నాటి ఉప ప్రధాని అద్వానీకి విముక్తి కల్పించారు. దీనిని పలువురు సవాల్‍ చేయడంతో తిరిగి నిందితులు అందరిపై అభియోగాలు నమోదయ్యాయి.
మొత్తం 49 మందిపై వేర్వేరు చోట్ల విచారణ సాగడంపై సీబీఐ 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2017, ఏప్రిల్‍ 19న అన్ని కేసులను లఖ్‍నవూ సీబీఐ కోర్టుకు అప్పగిస్తూ సుప్రీం ఉత్తర్వు లిచ్చింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
1992, డిసెంబరు 6.. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 7.30 వరకు కేవలం తొమ్మిదంటే తొమ్మిది గంటల్లో చోటుచేసుకుంటున్న ఘటన భారత దేశ ముఖచిత్రాన్నే మార్చేసింది. వేలల్లో పోలీసుల పహారా.. లక్షల్లో దూసుకొచ్చిన కర సేవకులు.. చూస్తుండగానే బాబ్రీ మసీదు నేలమట్టమైంది. మసీదు కూలిపోయిన సమయంలో ఆ ప్రదేశంలో 75 వేల నుంచి లక్షన్నర మంది వరకు కర సేవకులు ఉన్నారని లిబర్‍హాన్‍ కమిషన్‍ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం 1992, డిసెంబరు 6న వరుస సంఘటనల క్రమమిదీ..
ఉదయం 10.30 సమయంలో ఎల్‍కే అద్వానీ, మురళీ మనోహర్‍ జోషీ వంటి సీనియర్‍ బీజేపీ నేతలు, వీహెచ్‍పీ నాయకులు, సాధువులు కరసేవ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రామ్‍కథ కుంజ్‍కు వెళ్లారు.
మధ్యాహ్నం 12 గంటల వేళ.. ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని మసీదు గుమ్మటంపైకి ఎక్కాడు. వెంటనే మరో 150 మంది ఒక్కసారిగా మసీదును చుట్టుముట్టారు.
12.15 సమయానికి దాదాపు ఐదు వేల మంది వివాదాస్పద కట్టడంపైకి చేరారు. రాడ్లు, సుత్తులతో కూల్చివేత ప్రారంభించారు. అద్వానీ తదితరులు బయటకు వచ్చేయాలని వారించినా వారు వినిపించుకోలేదు.
బలగాలు మసీదు వద్దకు వెళ్లలేకపోయాయి. విధ్వంసాన్ని కళ్లప్పగించి చూశాయి.
మధ్నాహ్నం 1.55 సమయంలో కర సేవకులు మసీదు మొదటి గుమ్మటాన్ని కూల్చివేశారు.
మధ్యాహ్నం 3.30 సమయంలో అయోధ్యలో మత ఘర్షణలు చెలరేగాయి.
సాయంత్రం ఐదు గంటల వేళకు మసీదు పూర్తిగా కుప్పకూలిపోయింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‍లో రాష్ట్రపతి పాలన విధించింది. ముఖ్యమంత్రి కల్యాణ్‍సింగ్‍ రాజీనామా చేశారు.
రాత్రి 7.30 సమయంలో రామ్‍లల్లా విగ్రహాలను యథాతథంగా వాటి స్థానంలో ఉంచారు. తాత్కాలిక రామాలయ నిర్మాణం ప్రారంభమైంది

Review 1528-2019 రాం మందిర్ – సీదు వివాదం 500 ఏళ్ళు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top