సహనమే పూర్తి బలం

క్షమా శస్త్రం కరే యస్య, దుర్జనం కిం కరిష్యతే
(సహనమే ఆయుధమైన వారిని దుర్గార్గులు ఏం చేయగలరు?)
సాధారణంగా ఇతరుల వ్యాఖ్యలకు మనం తీవ్రంగా స్పందిస్తాం.
కానీ, మన వ్యాఖ్యలు ఇతరులను ఏ విధంగా బాధిస్తున్నాయనేది అసలు పట్టించుకోం.
ఇతరులు మనకు అలజడి కలిగించినంతగా, మనమూ వారికి అలజడి కలిగిస్తూ ఉండవచ్చు.
ఇతరులు మన ప్రవర్తనతో బాధపడి, మన నుంచి తప్పించుకుని పారిపోకూడదు.
అలా చేస్తున్నారంటే మనం మనుషులను కోల్పోతున్నామని అర్థం.
ఈ అవగాహన, ఎరుక, పరిజ్ఞానం కలిగి ఉండటమే ‘క్షాంతి’.
ఇతరుల ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడమనే లక్షణాన్ని పెంపొందించుకోవడాన్నే ఓర్పు లేక సహనం అంటారు.
ఇతరుల ప్రవర్తన వల్ల మనం అలజడి చెందకుండా ఉండటం సులభమే కానీ, ఇతరుల ప్రశాంతతను మనం భంగపరచకుండా ఉండటం చాలా కష్టం.
ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులకు అంతరాయం, అలజడి కలిగించకుండా ఉండే విధంగా మనపై మనకు నియంత్రణ ఉండాలి.
ఈ మనో నియంత్రణ వల్ల ఓర్పు అలవడుతుంది. ఇదే నిజమైన సాధనం.
‘సహనం’ అనేది ముఖ్యంగా ఇతరుల పట్ల అవగాహన కల్పించుకునే ఒక దృక్పథం.
చిన్న పిల్లవాడు ఏదైనా వస్తువు కింద పడవేస్తే మనం కోపగించుకోం.,
అదే పనిని పెద్దవాళ్లు చేస్తే తీవ్రంగా స్పందిస్తాం. పెద్దవాళ్లలో కూడా చిన్నపిల్లవాడి మనసును చూడగలిగితే, మనలో సర్దుకుపోగలిగే స్వభావం పెరుగుతుంది.
అప్పుడు ప్రశాంతంగా ఉండగలం.
ఓర్పు, సహనంతో ప్రపంచంలో దేనినైనా జయించవచ్చు. జీవితంలో చిన్న చిన్న సందర్బాల్లో కూడా నేడు మనం సహనం కోల్పోతున్నాం. ఇతరులతో మాటలకు బదులు వాదులాటకు దిగుతున్నాం.
వాగ్వాదం చేయకుంటే భేదాభిప్రాయాలు వాటంతటవే సమసిపోతాయి.
ఒకరితో ఒకరు కలహించుకోవడం వల్లే ఘర్షణ పుడుతుంది.
ఇటువంటి సందర్భాల్లో ఓరిమి వహించడమే విజ్ఞుల లక్షణం.

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review సహనమే పూర్తి బలం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top