ఆత్మ ప్రబోధ గీతం

శివభక్తితో శివగీత ప్రారంభ
మవుతుంది. నవవిధ భక్తి మార్గాల్లో శరణా గతి అత్యుత్తమ మైనదని మహర్షులు చెబుతారు. ఇందుకు ప్రతీకగా, శివగీత.. శివ శరణాగతితో ప్రారంభమై శివ శరణాగతితోనే ముగుస్తుంది. భగవంతుడి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు భగవంతుడి శరణాగతి కోరాల్సిందే. అంతకు మించిన మార్గాంతరం లేదు. అనేక సందర్భాల్లో పురాణ, ఇతిహాసాలు ఈ సత్యాన్ని నిరూ పించాయి కూడా.
నారద భక్తి సూత్రాలు కూడా ‘అధాతౌ భక్తిం వ్యాఖ్యాస్యామ:’ అంటూ భక్తికే పెద్దపీట వేశాయి. అల్లసాని పెద్దన కూడా ‘వాలిన భక్తి మ్రొక్కెద’నంటూ శరణాగతినే ప్రకటిస్తాడు.
శివగీత కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. తనను శరణు కోరిన వారి యోగ క్షేమాలను పరమేశ్వరుడే చూసుకుంటాడు. అంతటి దయాస్వరూపుడు పరమేశ్వరుడు.
ఆ గీత.. ఈ గీత ఒకటే ‘రాత’
దేహం జడ పదార్థం. పాంచభౌతికమైనది. జీవుడనే వాయువు దేహం నుంచి బయటకు రాగానే మిగిలేది కేవలం భస్మరాశి మాత్రమే. అది కూడా చివరకు గంగ పాలవుతుంది. నశించనిది ఆత్మ మాత్రమే. దానికి చావు పుట్టుకలు లేవు. బూడిద కుప్పగా మిగిలే భౌతిక శరీరం కోసం ఎందుకంత తీవ్రంగా ఆవేదన చెందుతావంటూ పరమేశ్వరుడు శ్రీరామ చంద్రమూర్తికి చేసిన జ్ఞానబోధే ‘శివగీత’. నిశి తంగా పరిశీలిస్తే భగవద్గీత, శివగీత- రెండూ ఒకే దృక్కోణంలో సాగుతాయి. రచనా సంవి ధానం కూడా దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. కొన్ని శ్లోకాల్లో సారూప్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అనంతమైన బ్రహ్మ జ్ఞానం, అద్వైత వేదాంతం శివగీతలో అంత ర్లీనంగా ఉంటాయి. ఏదో ఉపదేశంగా కాకుండా ఆత్మ చైతన్యాన్ని ఉద్దేశింపచేసే ప్రబోధ గీతంగా ఇది సాగుతుంది. భవబంధాల సంకెళ్లలో బందీగా మారిన మానవుడిని ఊరడించి, అతనిలో కర్తవ్య దీక్షను తట్టిలేపే చైతన్య గీతికగా శివగీత కనిపిస్తుంది. శివ గీతలోని శ్లోకాలను పరిశీలించి, కాల ప్రమా ణాల ఆధారంగా విశ్లేషించి భగవద్గీత కన్నా ముందుగానే ఇది ఆవిర్భవించిందని పండి తులు నిర్ధారించారు.
శివ కేశవులు వేరు కాదు..
ఇద్దరూ ఒక్కటే. అందుకు నిదర్శనమే ఇది.
భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవైష్ణవ క్షేత్రమనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆలయ పాలన బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చూస్తుంది. ఈ సంస్థ తిరుమలతో పాటు అనేక వైష్ణవాలయాలను పర్యవేక్షిస్తుం టుంది. అయితే, ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం- కపిల తీర్థం. పరమేశ్వ రుడు తిరుమల క్షేత్ర పాలకుడు కావడమే ఇందుకు కారణం.
తిరుపతిలో ఉన్న కపిల తీర్థాన్ని సుదర్శన చక్రత్తాళ్వార్ తీర్థం, చక్రత్తాళ్వారు తీర్థం, ఆళ్వారు తీర్థం అని కూడా పిలుస్తారు. ఏడుకొండల నుంచి అనేక ఔషధ మూలికలను తాకుతూ జాలువారే పుణ్యధారలతో ఏర్పడిన కపిల తీర్థం సరోవరం పక్కనే.. స్వయం భువుగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహా శివలింగం గల గుహాలయం ఉంది. కపిలేశ్వ రుడితో పాటు కామాక్షి అమ్మవారు, నరసింహ స్వామి తదితర ఆలయాలనూ దర్శించు కోవచ్చు. తిరుమల ఎంతటి ప్రాచీనమైనదో అంతకంటే ప్రాచీనమైనది కపిలేశ్వర స్వామి ఆలయం. పద్మావతికి, శ్రీనివాసుడికి కల్యాణం జరగాలని అనుగ్రహించిన వర ప్రదాత కపి లేశ్వరుడు.
తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనానికి ముందు.. కపిల తీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వహించాలి. ఆ తర్వాతే ఆపద మొక్కుల వాడిని దర్శించు కోవాలని స్థల పురాణం చెబుతోంది. తన దర్శనానికి వచ్చిన యాత్రికుల పాపాలను కపిలేశ్వరుడు దూరం చేస్తాడట. కపిలేశ్వరుడి వల్ల పాప విముక్త్తులై వారికి అమృతతత్వాన్ని (వేం), ఐశ్వర్యాన్ని (కట) ప్రసాదిస్తాడట వేంకట రమణుడు. ఏడు కొండల్లో నెలకొన్న అనేక పుణ్య తీర్థాలను దాటుకుని కపిల తీర్తం సరోవరంలో పడేం దుకు వస్తున్న ధారల కింద నిలబడి స్నాన మాచరించడం యాత్రికులకు మరపురాని అనుభూతి అనే చెప్పాలి. తిరుపతిలోని అలిపిరికి సమీపంలోనే ఉన్న ఈ క్షేత్రం ముందు నుంచే తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ రాకపోకలు సాగిస్తాయి. కాబట్టి యాత్రికులు సులువుగానే కపిల తీర్థం చేరుకోవచ్చు.

Review ఆత్మ ప్రబోధ గీతం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top