ఆరోగ్య భాగ్య శివరాత్రి

మహా శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఉండటం వెనుక ఎన్నెన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
మహా శివరాత్రి పర్వాన్ని నిర్వహించుకునే విషయంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి. శివార్చన, ఉపవాసం, జాగరణ.. ఈ మూడూ శివరాత్రికి చాలా ప్రత్యేకమైనవి.
శివార్చన
శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శివలింగాన్ని షోడశోప చారాలతో పూజించాలి.
ఉపవాసం
ఉపవాసం ఉండటం అంటే, శివరూపాన్ని ధ్యానిస్తూ, శివ నామ స్మరణ చేయాలి. రోజంతటిలో ఒకసారి మాత్రమే భోజనం చేసి.. చతుర్దశి రోజు రాత్రి శివుడిని పూజించాలి. మరుసటి రోజు భక్తులంతా కాల కృత్యాలు ముగించుకుని, శివారాధన చేసి, రోజంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్ర మవుతుంది.
జాగరణ
శివరాత్రి రోజు సూర్యాస్తమయం నుంచి మరు సటి రోజు సూర్యోదయం వరకు.. నిద్ర పోకుండా మేల్కొని ఉండటాన్ని జాగరణ అంటారు. పై మూడింటినీ పాటిస్తే శివుడి అను గ్రహం లభించ డమే కాదు.. సంపూర్ణ ఆరోగ్య భాగ్యం ప్రాప్తిస్తుంది.
శివరాత్రి పూజలతో తమో, రజో గుణాలు..
మహా శివరాత్రి నాడు నిష్టగా పూజలు చేయడం వల్ల తమో గుణం, రజో గుణం పెంపొందుతాయి. తమో గుణం అంటే- నిర్మల మైన మనసు. రజో గుణం అంటే- మంచి అల వాట్లు. అంటే శివరాత్రి నాటి పూజలతో మనిషి తమో, రజో గుణాలను పొందుతారన్న మాట.
శివ చిహ్నాలు.. ఆరోగ్య సూచికలు
మనం చేసే పనులే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఏ పని చేసినా, అది సరైనదా కాదా అనేది ఒకసారి ఆలోచించి ముందడుగు వేయాలని శివుడి చిహ్నాలు మనకు చెబుతున్నాయి. శివ చిహ్నాల వెనుక గల తాత్వి కతను అర్థం చేసుకుంటే, మనుషులు ఎలాంటి బాధలు లేకుండా, ఆయురారోగ్యాలతో, సంతో షంగా జీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పవిత్రంగా భావించే పరమేశ్వరుడి ఆయుధాలు లేదా చిహ్నాలు తెలిపే ఆరోగ్య రహస్యాలేమిటో ఒక్కసారి తెలుసుకుందాం.
జటాజూటం
శివుడనగానే వెంటనే స్ఫురించేది.. ముడి వేసి కట్టిన ఆయన జటాజూటం. అది ‘యూనిటీ’కి సంకేతం. మన ఆలోచనలను సరైన క్రమంలో ఉంచుతూ, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి ఐక్యత అనేది సహాయపడుతుంది. అందరితో కలిసి మెలిసి మెలిగితే.. ప్రశాంతత పొందుతాం. అందరం అందరి కోసం ఉన్నామనే మంచి భావన వల్ల మనసు తేలిక పడుతుంది. ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు, ఎసిడిటీ, తలనొప్పి వంటివి దరి చేరవు.
త్రిశూలం
శరీరం, మెదడు, అహం.. వీటన్నిటినీ తెలిసో తెలియకో నియంత్రించుకునే శక్తిని త్రిశూలం సూచిస్తుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా తెలివిగా ఆలోచించి మొదలుపెడితే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా శరీరం – మెదడు మధ్య సమన్వయం కుదిరితే మనిషి అద్భుతాలు సృష్టించ గలడు. ఆ రెండింటి సాయంతో మనలో ఉండే అహాన్ని నిరంతరం అణచిపెట్టి ఉంచాలి. అందుకు అవసరమైన సమన్వయ శక్తిని త్రిశూలాకారం సమకూరుస్తుంది. మనకు సరైనది అనిపించిన పని చేస్తూ, తప్పు అనిపించినది వదిలేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతాం. ఈ పద్ధతిని ఒక జీవన విధానంగా మార్చుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యవంతులుగా జీవించగలం.
ధ్యానం
శివుడు ఎక్కువగా ధ్యాన ముద్రలోనే కని పిస్తాడు. ధ్యానం, యోగా వంటి వాటికి ఆయనే ఒక చిహ్నం. ఇందులో ఎంతో నిగూఢమైన తత్వం ఉంది. మన కోసం మనకంటూ ఒక సమయాన్ని సృష్టించుకుని, మనమేమిటో తెలుసుకునే ప్రయ త్నాన్ని చేయాలని శివుడి ధ్యానముద్ర చెబుతుంది. గజిబిజి పరుగులు, ఒడిదుడుకుల జీవనంలో మన జీవితం గురించి మనకు ఆలోచనే లేకుండా పోతోంది. అయితే, ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం ఒంటరిగా, ప్రశాంతంగా కూర్చోవడం వల్ల మనపై మనకు అదుపు ఏర్పడుతుంది. మన ప్రవర్తన సరిగా ఉందా, లేదా అనేది అంచనాకు రావచ్చు. ఇందుకోసం ధ్యానముద్ర ఉపయోగపడు తుంది. ధ్యానం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే, ధ్యానం లేదా యోగాలో ఒక భాగమైన ప్రాణాయామం ఊపిరితిత్తులకు మంచి చేస్తుంది. అలాగే, శివుడు నిరంతరం తదేక ధ్యానముద్రలో కళ్లు మూసుకుని ఉంటాడు. చెడు అలవాట్లు, చెడు పనులకు దూరంగా ఉండాలని.. ఈ మూసి ఉన్న కళ్లు చెబు తున్నాయి. మంచి అలవాట్లతో ముందుకు వెళ్లా లనేందుకు ఇదో సంకేతం. జీవితం చాలా సందర్భాలలో తికమక పెడుతూ ఉంటుంది. చెడు అలవాట్లు, అనారోగ్యకరమైన పనులకు నిరంతరం మనం ఆకర్షితులమవుతూ ఉంటాం. అంటే, ప్రతీదీ కళ్లతో చూడటం వల్ల మంచితో పాటు చెడుకూ ఆకర్షితులవుతున్నాం. చెడు పట్ల ఆకర్షణ కాకూడదంటే.. రోజులో కొంతసేపు మూసిన కళ్లతో ధ్యానం చేయాలి.
విభూతి
ద్వేషం, స్వార్థం వల్లే మనుషులు నేడు ఎక్కు వగా అనారోగ్యాలకు గురవుతున్నారని ఆధునిక వైద్య పరిశోధనలు, అధ్యయనాలు కూడా చెబు తున్నాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. బతికే కొంత కాలం స్వార్థం, ద్వేష భావనలను మూట గట్టుకుని బతికితే.. చివరకు చితికి చేరాక కూడా చింత తీరదు. అశాశ్వతమైన ఈ జీవితంలో ద్వేషం, స్వార్థాలకు చోటివ్వకూడదు. వీటి వల్ల పొందే లాభం ఏమీ లేకున్నా.. మానసిక ప్రశాం తత మాత్రం కోల్పోతాం. మనలో వచ్చే సకల అనారోగ్య లక్షణాలకు అశాంతే కారణం. ఇటు వంటి దుర్గుణాలను విడనాడాలంటే జీవితం శాశ్వతం కాదని విభూతి చాటే సత్యాన్ని గ్రహించాలి.
నీలకంఠం
శివుడు క్షీరసాగర మథనం సమయంలో పుట్టిన హాలాహలాన్ని మింగడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. ఆ విష ప్రభావానికి ఆయన కంఠం నీలం రంగులోకి మారిపోయింది. కాబట్టే ఆయ నను నీలకంఠుడు అంటారు. ఈ నీల కంఠం కోపాన్ని అణచుకోవాలని చాటుతుంది. ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి లక్షణాలన్నీ కోపం ద్వారానే మొదలవుతాయి. కోపం ఉండటం వల్ల ఆందోళన పెరుగుతుంది. కాబట్టి దానిని శివుడు విషాన్ని తన కంఠంలో అట్టిపెట్టుకున్నట్టు మనం మనలోని కోపాన్ని ఏదో స్థాయిలో నిగ్రహించుకోవాలి. కోపం అనేది అదుపులో ఉంటే ఆస్తమా, ఎసిడిటీ వంటి సమస్యలు దరి చేరవు.
ఢమరుకం
కోరికలపై నియంత్రణ ఉండాలని ఢమరుకం హెచ్చరిస్తుంది. అనవసర కోరికలను అదుపులో పెట్టుకుంటూ మనసును ప్రశాంతంగా, పవి త్రంగా ఉంచుకోవాలని ఈ చిహ్నం సూచిస్తుంది. మనలో అనవసరమైన అలజడులు, కోరికలు చెల రేగినపుడు ఢమరుకం శబ్దం మాదిరిగా మనం అప్రమత్తం కావాలి. ‘వద్దు.. వద్దు.. వాటి జోలికి పోవద్దు’ అని ఆ శబ్దాలు సూచిస్తున్నట్టు భావించాలి.
గంగ
శివుడి జటాజూటంలో ఒదిగిపోయింది గంగ. ఆమె పవిత్రతకు చిహ్నం. శరీరం, మనసులో ఉన్న చెడు భావనలు, తలంపులను శుభ్రం చేసు కోవాలని పరిశుభత్రకు చిహ్నమైన గంగ సూచి స్తుంది. శరీరం, మనసు పవిత్రంగా ఉంటే ఆరో గ్యంగా ఉంటాం.
పాము
శివుడి మెడ చుట్టూ పెనవేసుకుని ఉండే పాము నిగ్రహశక్తికి సూచిక. మనిషి ఎల్లప్పుడూ నిగ్రహంగా ఉండాలి. పరిస్థితులు, ప్రభావాలకు లొంగిపోకూ డదు. ఆలోచనలు, భావనలు, మంచి లక్షణాలు, గుణాల విషయంలో మనసు, అలవాట్లు, వ్యవ హారాల విషయంలో శరీరం నిగ్రహంగా లేదా అప్రమత్తంగా ఉంటే హైపర్ టెన్షన్, కార్డియో వాస్క్యులర్ డిసీజ్ల వంటివి రాకుండా ఉంటాయి.

Review ఆరోగ్య భాగ్య శివరాత్రి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top