అభిమన్యుడు

శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రకు, మేనబావ అర్జునుడికి పుట్టిన అభిమన్యుడిలో ఇటు మేనమామ శ్రీకృష్ణుడిలోని ఉజ్వల గుణాలూ, ఇటు పితృపాదులైన పాండవులందరి గుణాలూ గుదిగుచ్చినట్టు కనిపిస్తాయి. యుధిష్ఠిరుడి ధర్మపరాక్రమమూ, శ్రీకృష్ణుడి ధర్మశీలమూ, భీముడి వీరోచితత్వం, అర్జునుడి రూప పరాక్రమాలు, విలువిద్యా నైపుణ్యం, నకుల సహదేవుల వినయశీలమూ అభిమన్యుడిలో రూపుగట్టి ఉంటాయి.
‘అభి’ అంటే అభిముఖంగా అని అర్థం. ‘మన్యు’ అంటే దీప్తి, ఉత్సాహమూనూ. కోపమనే అర్థం కూడా ఉంది.
చైతన్యమంతా లక్ష్యంపై కేంద్రీకృతమై, లోపలి, బయటి శత్రువులపై అదుపునూ, సంయమనాన్నీ కనబరిచే తీవ్రమైన మనోభావమే అభిమన్యుత్వమంటే. దుర్యోధనుడు ద్రోణుడిని సేనాపతిగా చేసినపుడు ‘ధర్మరాజును సజీవంగా పట్టుకుని తీసుకురావాలి’ అని చెప్పాడు.
‘నేను ధర్మరాజును పట్టి తెస్తే ఏం చేస్తావు?’ అని అడిగాడు ద్రోణుడు.
‘మళ్లీ జూదమాడించి అడవులకు పంపుతాను. దాంతో నా రాజ్యం నాకు చాలాకాలం నా చేతిలోనే ఉంటుంది’ అన్నాడు దుర్యోధనుడు.
ఇష్టం లేకపోయినా ద్రోణుడు సరేనన్నాడు. ధర్మరాజును పట్టుకోవడానికి అతడెన్ని వ్యూహాలు పన్నినా వాటన్నింటినీ అర్జునుడు తుత్తునియలు చేశారు. అతిరథ మహారథులెందరినో రంగంలోనికి దింపిన వారందరనీ తన అస్త్రశస్త్రాలతో అర్జునుడు నిహితులను చేశాడు. ఈసారి ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. దీంతో ధర్మరాజు భయపడ్డాడు. అయితే, దృష్టద్యుమ్నుడి భరోసాతో రణాన్ని కొనసాగించాడు. ద్రోణుడి యుద్ధ పద్ధతిని చూసి దుర్యోధనుడు మురిసిపోయాడు. కానీ అర్జునుడి కారణంగా ధర్మరాజును బందీ చేయడం కుదరలేదు.
రెండు రోజులైపోయినా తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని దుర్యోధనుడు ద్రోణుడిని నిష్టూరమాడాడు. ద్రోణుడు బాధపడ్డాడు.
‘ఈరోజు దేవతలకు అభేద్యమైన ఒక వ్యూహాన్ని పన్నుతాను. ఏదో ఒక యోగంతో అర్జునుడిని యుద్ధానికి దూరంగా వెళ్లేలా చేస్తాను. ఈ రోజు ఎవడో ఒక మహాయోధ అంతం కావడం ఖాయం’ అని ద్రోణుడు నిశ్చయంగా చెప్పాడు. అనుకున్నట్టే ద్రోణుడి వ్యూహం ఫలించి, ద్రోణుడి తరపున పోరాడుతున్న సంశప్తక గణాలు అర్జునుడిని యుద్ధరంగం నుంచి చాలా దూరం తీసుకుపోయాయి. మూడో రోజు చక్ర వ్యూహాన్ని పన్ని, ఆ చక్రపు ఆకుల మీదుగా అతి తేజస్వులైన పలువురు రాజకుమారులను మోహరించాడు ద్రోణుడు. ఆ సైన్యానికి ముఖభాగంలో తానే నిలుచున్నాడు. జయద్రథుడూ, అశ్వత్థామా అతని పక్కనే స్థాణువుల్లా నిలిచారు. ఈ విధంగా వ్యూహాన్ని రచించిన ద్రోణుడిని ఎదుర్కోవడం అర్జునుడి లేని తరుణంలో మరొకడి వల్ల కాదని భావించిన ధర్మరాజు వెంటనే యుద్ధరంగంలోకి అభిమన్యుడిని దించాడు.
‘నాకు చక్రవ్యూహాన్ని భేదించడమే తెలుసు. కానీ, ఏదైనా ఆపద వస్తే ఆ వ్యూహం నుంచి ఎలా బయటపడాలో తెలియదు’ అని అభిమన్యుడు అనగా, ‘పర్వాలేదు. నీ వెన్నంటి మేమంతా ఉంటాం. అంతా నీ వెన్ను కాస్తాం’ అని ధర్మరాజు భరోసానిచ్చాడు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించగానే, అతని వెంట ఉన్న మిగతా వీరులను లోనికి చొరబడకుండా సైంధవుడు అడ్డుకున్నాడు. దీంతో కౌరవసేనతో అభిమన్యుడు ఒంటరిగానే పోరాడాల్సి వచ్చింది. అయినా వెనకడుగు వేయకుండా కౌరవసేనలోని వీరులెందరినో సంహరించాడు. చివరకు దుర్యోధనుడు తన కొడుకు లక్ష్మణ కుమారుడిని అభిమన్యుడిపైకి పంపాడు. లక్ష్మణుడు అభిమన్యుడి భుజాల మీదా, ఛాతీ మీదా బాణాలతో దాడి చేశాడు. బదులుగా కుబుసం విడిచిన పాములాగా బుసలు కొడుతూ ఒక బల్లాన్ని లక్ష్మణుడి మీదికి విసిరాడు అభిమన్యుడు. అది దుర్యోధనుడు చూస్తుండగానే లక్ష్మణ కుమారుడి తలను మొండెం నుంచి వేరు చేసింది. దుర్యోధనుడు పుత్రశోకంతో విలపించాడు. కర్ణుడు నిశ్చేష్టుడైపోయాడు.
అప్పుడు కర్ణుడు ద్రోణుడితో ‘అభిమన్యుడి కవచం దుర్భేద్యం. అర్జునుడికి నేను చెప్పిన కవచ ధారణ విధిని ఇతను పాటించాడు. కానీ ఇతని విల్లు విరగ్గొట్టి నారిని ఛేదించవచ్చు. ఇతని గుర్రాలను అటూఇటూ వెనక నుంచి కాపాడుతున్న సారథుల్ని నాశనం చేయవచ్చు’ అని ఉపాయాన్ని చెప్పాడు.
కర్ణుడు వెంటనే ఆ ఉపాయాన్ని అమలు చేస్తూ అభిమన్యుడి రథాన్నీ, ధనుస్సునీ విరగొట్టాడు. కృతవర్మ గుర్రాలను చంపాడు. కృపుడు అభిమన్యుడి వెనుక ఉన్న రక్షకులిద్దరినీ కూల్చాడు. ఆపై ద్రోణుడితో సహా అందరూ కలిసి అతడిని బాణవర్షంలో ముంచెత్తారు. అభిమన్యుడి శరీరం రక్తసిక్తమైపోయింది. అయినా ధైర్యాన్ని విడవకుండా చక్రాన్ని తీసుకుని అపర శ్రీకృష్ణుడిలా విజృంభించాడు. కానీ, అన్యాయంగా ఆరుగురు కలిసి అతని చక్రాన్ని ముక్కలు చేశారు. ఆ మీదట గదను తీసుకుని అభిమన్యుడు వారిపైకి ఉరికాడు. అశ్వత్థామ తాలూకు నాలుగు గుర్రాలనూ, పార్శ్వ రక్షకులనూ సంహరించాడు. శకుని తమ్ముడు కాలికేయుడిని నేలకొరిగేలా మోదాడు. అతడి డెబ్బై ఏడు మంది అనుచరులనూ చంపేశాడు.
అప్పుడు దుశ్శాసనుడి కొడుకు కోపంతో గదను తీసుకుని అభిమన్యుడిపై దాడి చేశాడు. తల మీద గదతో మోది అభిమన్యుడిని చంపేశాడు. పద్మ సరసును కకావికలం చేసి వనగజంలా మొత్తం కౌరవ సైన్యంతో మూడు చెరువుల నీళ్లు తాగించి, అంతమందీ అధర్మంగా ఒకేసారి దాడి చేయడంతో.. చివరకు దుశ్శాసనుడి కొడుకు చేతిలో నేలకు ఒరిగిపోయాడు అభిమన్యుడు.
యుద్ధరంగంలోని పద్మవ్యూహమే కాదు.. సంసార చక్రంలో చిక్కుకున్నా కూడా అత్యంతమైన ధారణతోనూ, సమాధితోనూ చివరి దాకా పోరాడాలనే జీవన సత్యాన్ని అభిమన్యుడి వీరగాథ మనకు తెలియజెబుతుంది.

శ్రీ పరాభవ నామ
సంవత్సర ఫలం

శ్రీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలాన్ని బట్టి.. రాజులు, సామంతులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను నానా విధాలుగా పీడిస్తారు.
శ్రీ ఆకలి బాధలు పెరుగుతాయి.
శ్రీ రాజులు పరస్పరం కలహించుకుని నవ్వులపాలు అవుతారు.
శ్రీ అపర ధాన్యాలు బాగా పండుతాయి.
శ్రీ పరాభవ సంవత్సరాధిపతి కేతువు.
శ్రీ ఫలితంగా వర్షాలు మధ్యమంగా కురుస్తాయి.
శ్రీ చైత్ర, వైశాఖ మాసాలలో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.
శ్రీ మేఘాడంబరవు, ఉరుములు, మెరుపులు ఉంటాయి.
శ్రీ వడగాడ్పులు అధికంగా ఉంటాయి.
శ్రీ జ్యేష్ఠ మాసంలో వడగాడ్పులు మరింత పెరుగుతాయి.
శ్రీ అగ్ని భయం కలుగుతుంది.
శ్రీ ఆషాఢ మాసంలో అల్పవృష్టి, ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.
శ్రీ శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఈ మాసంలో ఖండవృష్టి, దుర్భిక్షము కలుగుతాయి.
శ్రీ ఆశ్వయుజ మాసంలో ధాన్యములు, ధాతు వస్తువులు, రస వస్తువుల ధరలు పెరుగుతాయి.
శ్రీ కార్తీక మాస పంచకంలో ధరలు సరసరంగా ఉంటాయి.
శ్రీ పశ్చిమ దేశాలలో ఆహార ధాన్యాల ధరలు సరసంగా ఉంటాయి.
శ్రీ సింధు, పంజాబ్‍ సరిహద్దు ప్రాంతాల్లో పంటలు బాగా పండుతాయి.
పరాభవ నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా
ఆదాయ వ్యయాలు, రాజపూజ్య-అవమానాలు

Review అభిమన్యుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top