ఉత్తరాయణం

ఇండిపెండెన్స్ డే

భారత స్వాతంత్య్రోద్యమం గురించి ఆగస్టు సంచికలో అందించిన వివరాలు బాగున్నాయి. నాడు దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగ ధనులు చేసిన త్యాగాలను చదివి ఒళ్లు జలదరించింది. మన తెలుగు వారం, అందునా భారతీయులం ఎక్కడున్నా.. పొగడాలి నిండు భారతిని. ఎంతో ఉత్తే జితం కలిగించిన వ్యాసం అందించినందుకు ధన్య వాదాలు.
-చంద్రమౌళి, కనకేశ్వర్‍, బాలచందర్‍, పి.శివశంకర్‍, పీకే కైలాష్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

గొప్ప వికాసం

మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్య ఫలం ఒక్కోసారి మనం చేసే చెడు పనుల (దుష్కర్మ)ల వల్ల శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమై మనిషిని కష్టాలపాల్జేస్తుంది. మనిషి స్వర్గసుఖాలను, సిరి సంపదలను, భోగభాగ్యాలను అనుభవిస్తూ ఆదమరిచి పుణ్యకార్యాలను చేయడం మానుకొంటే, తాను నిలవు ఉంచుకున్న ఫుణ్యఫలం కాస్తా హరించుకునిపోయి తిరిగి మనిషి కష్టాల పాలవుతాడు. దీనికై మనిషి పాపపు పనులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి, ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉంటుంది? అది మనల్ని ఎలా వెంబడిస్తుంది? అనే విజ్ఞతను ప్రదర్శిస్తే సచ్ఛీలుడై వెలుగొందుతాడంటూ తెలుగు పత్రిక గత సంచికలోని ఆధ్యాత్మిక వికాసంలో అందించిన వివరాలు ఆలోచింప చేశాయి. ఇటువంటి మంచి శీర్షికలు మరిన్ని అందించగలరు.
-ఆది వెంకటరమణారావు- హైదరాబాద్‍, చంద్రశేఖర్‍శర్మ- విజయవాడ, కల్పన.పి.- గుంటూరు (ఈ-మెయిల్‍ ద్వారా)

శ్రావణ విశేషాలు

‘తెలుగు పత్రిక’ అంతర్జాతీయ ఆధ్యాత్మిక మాస పత్రిక ఆగస్టు సంచికలో శ్రావణ మాసం గురించి అందించిన ముఖచిత్ర కథనం నిజంగా అద్భుతం. ఆ మాసం విశేషాల గురించి వర్ణించిన తీరు, ఆ నెలలో వచ్చే ముఖ్య పర్వాలు, పండుగల గురించి అత్యద్భుతమైన వివరాలు అందించారు. తెలుగు వారికి శ్రావణ మాసాన్ని మించిన శుభ మాసం లేదు. దానికి తగిన ప్రాధాన్యతనిచ్చి, విదేశాల్లో ఉన్న తెలుగు వారితో పాటు మన తెలుగు వారికి దాని ప్రాముఖ్యత గురించి తెలియ చెప్పిన తీరు బాగుంది. ఇటువంటి విలువైన అంశాలను మరిన్ని తెలుగు పత్రిక అందించాలని కోరుకుంటూ..

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top