ఉత్తరాయణం

నవ్వుల పువ్వులు

తెలుగు పత్రిక మే మాసం సంచిక విశేషంగా చదివించింది. ముఖ్యంగా నవ్వుల దినోత్సవం గురించి అందించిన ముఖపత్ర కథనం చాలా బాగుంది. నవ్వు అనేది నేడు మనుషుల ముఖాల నుంచి ఎలా మాయమైపోతోందో, దాన్ని పొదివి పట్టుకోవాల్సిన ఆవశ్యకత గురించి బాగా వివరించారు. నవ్వుల దినోత్సవానికి భారతీయుడే ఆద్యుడని తెలిసి ఆనందం అనిపించింది. అలాగే, మాసం – విశేషం ఇతర శీర్షికలు బాగుంటు న్నాయి.
– సర్వేశ్‍, వర్మ, బి.అమర్‍బాబు- ఆన్‍లైన్‍ పాఠకులు, చంద్రశేఖర్‍రావు- హైదరాబాద్‍, మరికొందరు పాఠకులు

తల్లీ వందన

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక మే సంచికలో మాతృభాష దినోత్సవం సంద ర్భంగా క్లుప్తంగా అయినా, మంచి వివరాలు అందించారు. ఓ తల్లిని కొడుకు వృద్ధాశ్రమంలో వదిలేసిన తీరు గురించి చదివి మనసు చలించి పోయింది. నేటి సమా•ంలో ఇటువంటివి జరగడం నిజంగా దురదృష్టకరం. వృద్ధాశ్రమాలు మన నిర్లక్ష్యానికి, పెద్దల పట్ల మనం చూపు తున్న నిరాదరణకు నిదర్శనాలుగా నిలుస్తున్నా యనడంలో ఎటువంటి సందేహం లేదు.
– యోగీశ్వరరావు- విజయవాడ, ఎం.డీ.అన్వర్‍- హైదరాబాద్‍, శశికళ- విశాఖపట్నం, శ్రేయ్‍, సంజీవ్‍రెడ్డి, రామ్‍.బీహెచ్‍.- టెక్సాస్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు.

వంటలు.. వండర్

‘సూపర్‍ డిష్‍’ శీర్షిక కింద అందిస్తున్న వంటల సమాచారం బాగుంటుంది. వివిధ డిషెస్‍, వాటి తయారీ విధానం బాగా వివరిస్తున్నారు. అలాగే, ఈ శీర్షిక ద్వారా సరికొత్త వంటకాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. కొన్ని వంటకాలను స్వయంగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాం. మునుముందు కూడా మరిన్ని మంచి వంట కాలను పరిచయం చేయగలరు. ఈ శీర్షికకు మేమంతా రెగ్యులర్‍ పాఠకులుగా మారామని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
-లావణ్య, కీర్తి- విశాఖపట్నం, ఆర్‍.రాగిణి- హన్మకొండ, పి.మౌనిక- హైదరాబాద్‍, రాజమణి- హైదరాబాద్‍

తెలుగు జిలుగులు

తెలుగు జిలుగులు, సామెత కథలు, జాతీ యాలు వంటి శీర్షికలు పత్రికకే హైలైట్‍గా నిలుస్తు న్నాయి. ఇవి విజ్ఞానాన్ని, వినోదాన్ని కూడా అందిస్తు న్నాయి. అలాగే, మంత్రపుష్పం శీర్షికన అందిస్తున్న శ్లోకాలు బాగుంటున్నాయి.
– మారం అశోక్‍, హైదరాబాద్‍

ఆధ్యాత్మికం

ఆధ్యాత్మిక విషయాల గురించి వివరణ, విశ్లే షణ బాగుంటోంది. అందరూ చదవదగిన శీర్షిక లతో తెలుగుపత్రికను తీర్చిదిద్ది వెలువ రిస్తున్నందుకు అభినందనలు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగించండి.
– రతన్‍.పి.రాజ్‍- టెక్సాస్‍

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top