ఉత్తరాయణం

తిరుమల సమాచారం..
మన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు వేంచేసి ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ‘తెలుగు పత్రిక’లో రెగ్యులర్‍గా కొంత సమాచారం ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దేశం కాని దేశంలో ఉన్న వారంతా దాదాపు ఆ శ్రీనివాసుని భక్తులే. వారంతా ఆ స్వామి వారి విశేషాల గురించి తెలుసు కోవాలని అనుకోవడం సహజం. కాబట్టి స్వామికి సంబంధించి ఏయే ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? స్వచ్ఛంద సేవలు అందించేందుకు ఎప్పుడెప్పుడు అవకాశాలు ఉన్నాయి?, స్వామి నిజసేవలో పాల్గొనే అవకాశం తదితర సమాచారాన్ని అందించడం వల్ల విదేశీయులు వాటిని సమయానుగుణంగా వినియో గించుకునే వీలుంది. కాబట్టి తిరుమల సమాచారాన్ని ఇచ్చే విషయాన్ని పరిశీలించగలరు.
– జయేశ్‍, సి,రఘవీర్‍, టీఎస్‍ చారి, రావు ఆనందరావు, కె.శోభ- ఆన్‍లైన్‍ పాఠకులు, కేఎస్‍ రావు, టి.సుందర్‍- హైదరాబాద్‍, షణ్ముగం- చిత్తూరు, శేషు.ఎస్‍, కైలాస్‍- అట్లాంటా

ఆషాఢ విశేషాలు
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక జూలై సంచికలో ‘మాసం – విశేషం’ శీర్షిక కింద ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్య తిథుల గురించిన వర్ణన బాగుంది. వివరాలన్నీ ఆసక్తికరంగా చదివించాయి. ఆషాఢంలో వచ్చే ముఖ్య పండుగలు, పర్వాలు, ఇతర వ్రతాల గురించి విపులంగా వివరాలు అందచేశారు. అలాగే, ఆయా ముఖ్య దేవతల శ్లోకాలు, వాటి అర్థ తాత్పర్యాల గురించి కూడా ‘తెలుగు పత్రిక’ పాఠకులకు అందించే ప్రయత్నం చేయండి. శ్లోకాలకు గల అసలైన అర్థాలను తెలుసుకుని స్తుతించినపుడే భక్తికి సార్థకత ఏర్పడుతుంది.
– హరిచందర్‍, చంద్రమౌళి, పి.కార్తీక్‍, మధుబాబు- హైదరాబాద్‍, మధులత, వినయ్‍- మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

గురుభ్యో నమః
‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక జూలై సంచికలో గురుపౌర్ణమి సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం చదివించింది. గురువుకు భారతీయ సమాజంలో ఉన్న ప్రాధాన్యం, గురువులు మనకు ఏర్పర్చిన ఆధ్యాత్మిక పరంపర, గురు పరంపర ఎలా మొదలైందీ ఎంతో చక్కగా వివరించారు. ప్రస్తుతం గురుపౌర్ణమి సాయిబాబా ఆరాధనకే ఎక్కువగా ప్రసిద్ధి పొందింది. మానవ జీవితానికి గురువు ఎలా మార్గదర్శిగా, చుక్కానిలా ఉపయోగపడతారో చెబుతూ షిర్డీ సాయినాథుని కథలను ఉదహరించడంతో చదివించింది.
-రాజమహేందర్‍, సురేశ్‍కృష్ణ, కె.రామ్‍ప్రసాద్‍, సి.కౌసల్య, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

విలక్షణ అనుభూతి
ఆధునికత, ఆధ్యాత్మికత కలబోసిన తీరులో తెలుగు పత్రిక అంతర్జాతీయ ఆధ్యాత్మిక మాస పత్రిక అలరిస్తోంది. అన్ని శీర్షికలు వేటికవే భిన్నమైనవి, విలక్షణమైనవని చెప్పక తప్పదు. అటు మన భారతీయ సంస్క•తి గొప్పదనాన్ని చాటుతూనే ఇటు తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్.

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top