ఉత్తరాయణం

విశ్వావసు
తెలుగు పత్రిక మార్చి 2025 సంచికలో విశ్వావసు నామ సంవత్సరం గురించి అందించిన వివరాలు బాగున్నాయి. ముఖ్యంగా విశ్వావసు ఎవరు? అంటూ ఆయన గురించి తెలియచెప్పిన వివరాలు చదివించాయి. వేదాలు, పురాణాల్లో దాదాపు 20చోట్లకు పైగా ఆయన పేరు ఉన్న వైనం, ఆయన చేసే మేలు వంటి విశేషాలు ఎన్నో విషయాలను తెలియజెప్పాయి.
– కె.రామకృష్ణ, కె.శివ, సీహెచ్‍.శివప్రసాద్‍, రామేశ్వరరావు, ఆనందరావు, పరిమళ, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

ఔషధ వేప
ఉగాది నేపథ్యంలో వేప చెట్టు ప్రాధాన్యాన్ని తెలుపుతూ అందించిన ఆరోగ్యభాగ్యం శీర్షిక చదివించింది. ఉగాది పండుగ సందర్భంలో పచ్చడి చేసుకోవడానికి, ఇంటికి తోరణాలు కట్టడానికి మాత్రమే మనం ఉపయోగిస్తున్న వేప.. ఔషధపరంగా ఎంత ప్రాముఖ్యం గలదో, దీని ఆరోగ్య ప్రయో•నాలేమిటో బాగా వివరించారు.
– ఎల్‍ఆర్‍ఎస్‍ వెంకటేశ్‍, ఆర్‍.రవి, హైదరాబాద్‍

క్లుప్తంగానైనా..
తెలుగు పత్రిక మార్చి సంచిక ఎన్నో విశేషాలను అందించింది. విశ్వావసు నామ సంవత్సర ప్రాధాన్యం, వేపవృక్షం తదితర కథనాలు బాగున్నాయి.
– వినోద్‍, తిరుపతి

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top