ఉత్తరాయణ

ఆధ్యాత్మిక వల్లరి
తెలుగు పత్రిక ఫిబ్రవరి సంచికలో అందించిన శివరాత్రి మహోత్సవం, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు, మేడారం మహా జాతరల గురించిన వివరాలు బాగున్నాయి. సమయానుగుణంగా ఆయా పర్వాలు, వేడుకల గురించి వివరిస్తున్న తీరు బాగుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారికి ఈ వివరాలు తెలుసుకోవడం ఎంతో అవసరం.
-సీహెచ్‍.రవికిరణ్‍- న్యూయార్క్, ఆన్‍లైన్‍ పాఠకుడు, ఆర్‍కే ప్రత్యూష- హైదరాబాద్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
వికాస తరంగిణి
‘తెలుగు పత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక సంచికలో ఆధ్యాత్మిక వికాసం పేరిట ఇస్తున్న శీర్షిక ఎంతో విలువైనది. దీంట్లో నేర్చుకోవాల్సిన నైతికత ఎంతో ఉంది. ఈ రోజుల్లో ఇటువంటి మంచిచెడు చెప్పే పెద్దలు ఎవరి ఇంట్లోనూ లేరు. కొన్ని కారణాలతో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. అటువంటి సమయంలో సందర్భానుసారం ఇస్తున్న ఆధ్యాత్మిక వికాసం, ఆధ్యాత్మిక కథ, పిల్లల కథలు వంటివి నీతి నియమాలను నేర్పుతూ లోటును తీరుస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని కావాలి.
– పి.మహేందర్‍, సి.హనుమంతరావు, రాజీవ్‍రెడ్డి- హైదరాబాద్‍, శ్రీకాంత్‍, మహేశ్‍.ఎం., మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు
విశేషాల మాసం
తెలుగు పత్రికలో ప్రతి నెలా అందిస్తున్న ఆ మాసపు విశేషాలు బాగుంటున్నాయి. ఎంతో సమాచార యుక్తంగా ఉండటమే కాక, ఆ తిథి పర్వపు విశేషాలను, వివరాలను అందించడం బాగుంది. మనవన్నీ తిథులతో ముడిపడిన పండుగలు, పర్వదినాలే. మనకు ఆ పండుగలు, పర్వాల గురించి తెలుసు కానీ, దానికి మూలమైన తిథి గురించి చాలామందికి తెలియదు. దీని గురించి ప్రధానంగా తెలుపుతూ ఇవ్వడం మంచి ప్రయత్నం. చాలామంది తెలుసుకోవాల్సిన విషయాలివి.
– టి.వెంకటేశ్‍-వరంగల్‍, సురేశ్‍-హైదరాబాద్‍, ఆర్‍.దివ్య, చక్రపాణి-ఖమ్మం, దిలీప్‍కుమార్‍, క్రాంతికిరణ్‍- ఆన్‍లైన్‍ పాఠకులు
తెలుగు వారి సేవలో..
ఈ రోజుల్లో మన సంస్క•తీ సంప్రదాయాలను తెలియచేస్తూ, వాటి ప్రాధాన్యతను, విశేషాలను అందరికీ తెలియపరుస్తూ ఉన్నత విలువలతో కూడిన శీర్షికలను అందిస్తున్న తెలుగు పత్రిక యాజమాన్యానికి అభినందనలు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తెలుగు వారికి ఇవి ఎంతో విలువైనవి. ఇవి చదివి నేర్చుకోవలిసింది చాలా ఉంది. అటువంటి ప్రయత్నం చేస్తున్న తెలుగు పత్రిక కృషికి మరేదీ సాటిరాదు.
– వెంకట్‍.ఆర్‍.- అట్లాంటా (ఈ-మెయిల్‍ ద్వారా)

Review ఉత్తరాయణ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top