ఊరంతా సంక్రాంతి నేలంతా పూబంతి

మన పంటలు ఇంటికి వచ్చే వేళ.. ముంగిళ్లలో పాడి పొంగిపొరలే వేళ.. గంగిరెద్దులు, జానపదులు ఆడిపాడే వేళ.. లిప్తపాటు కాలంలో ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ మహా పుణ్యకాలానికి నాంది పలుకుతాడు. దీంతో ప్రజలు ఈ సంక్రమణ కాలమనే సంక్రాంతి పండుగను తీయతీయగా చేసుకునేందుకు సిద్ధమవుతారు. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా మన పల్లెల్లో నెలకొనే పండుగ వాతావరణం కమనీయం. ఈ వేడుకలకు అంతటికీ మూల కారణం సూర్యుడే.

చెరువు చెంతకు చేరితిమి.. చేపలు, పీతలు చూచితిమి

గుడుగుడు కుంచం గుడుగుడు కుంచం గుండే రాగం పావడ పట్టం పడిగే రాగం అప్పడాల గుర్రం ఆడుకోబోతే, పే పే గుర్రం పెళ్లికి పోతే, అన్నా అన్నా నీ పెళ్లి ఎప్పుడంటే రేపు కాక ఎల్లుండి, కత్తీ కాదు బద్దా కాదు గప్చుప్ లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసే బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసే అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసే ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి ఉగ్గెట్టు మీయమ్మ ఊరెళ్లింది పాలిచ్చు మీయమ్మ పట్నమెళ్లింది నీలోసె మీయమ్మ నీళ్లకెళ్లింది లాలి లాలమ్మ లాలి లాలమ్మ చక్కని లోకంలో

పందెమే గెలిచింది నా గాలిపటం

చెమ్మ చెక్క చారడేసి మొగ్గ చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పొయ్యంగ ఆరగించంగ ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మ చెక్క రంగులెయ్యంగ పగడాల చెమ్మ చెక్క పందిరెయ్యంగ పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ చూచి వద్దాం రండి, సుబ్బారాయుడి పెళ్లి చూచి వద్దాం రండి మా వాళ్లింట్లో పెళ్లి మళ్లీ వద్దాం రండి దొరగారింట్లో పెండ్లి దోచుకు వద్దాం రండి. లాలమ్మ లాలి.. లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె ఊరుకో

ఒదిగి

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. హైదరాబాద్‍ దక్కనీ

సంగీతానికి గాడిద.. హాస్యానికి కోతి

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట ఇంపుగాలేని వ్యవహారం

Top