నీలాంబరివే..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పూజాహెగ్డే హవా నడుస్తోంది. త్వరలో వరుసగా విడుదల కానున్న అన్ని భారీ బడ్జెట్‌ చిత్రాల్లోనూ ఆమె నటిస్తోంది. ఒకపక్క తెలుగుతో పాటు తమిళం, కన్నడంలోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న పూజా మరోపక్క బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. దీంతో డిమాండ్‌ ఉన్న హీరోయిన్‌గా ఆమె అవతరించింది. ఇటీవలే పుట్టిన రోజు జరుపుకున్న ఆమె.. తన కొత్త సినిమాల గురించి చెప్పుకొచ్చింది. అలాగే వివిధ సినిమాల్లోని ఆమె లుక్‌కు సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ కాంబోలో వస్తున్న ఆచార్యలో ఆమె రామ్‌చరణ్‌ సరసన తళుక్కుమననుంది. అలాగే, ప్రభాస్‌ సరసన రాధేశ్యామ్‌లో మెరవనుంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తనకు లభిస్తున్న అవకాశాలపై చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..
‘ఆచార్య’లో మెగాస్టార్‌ చిరంజీవి గారి సినిమాలో అవకాశం రావడం అదృష్టం. ఈ సినిమాలో నేను నీలాంబరి అనే పాత్రలో కనిపిస్తాను. రామ్‌చరణ్‌ సరసన సంప్రదాయబద్ధమైన యువతి పాత్ర పోషించారు. ఇంతకుముందు ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌తో కలిసి ఓ ఐటెమ్‌ సాంగ్‌ చేశాను. అయితే ఆచార్యలో పూర్తి నిడివి పాత్ర పోషిస్తున్నాను.
‘రాధేశ్యామ్‌’లో నా పాత్ర పేరు ప్రేరణ. ప్రభాస్‌ సరసన నటిస్తున్న ఈ సినిమా ఓ వింటేజ్‌ మూవీ. మంచి ప్రేమకథతో రూపుదిద్దుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో పూర్తి ఆధునిక యువతిగా కనిపించనున్నాను.
పవన్‌కల్యాణ్‌ ` హరీశ్‌శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీలోనూ హీరోయిన్‌గా చేస్తున్నాను. అగ్రహీరో సరసన నటించనుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. అయితే, హరీశ్‌శంకర్‌తో కలిసి నాకు ఇది మూడో సినిమా. ఇంతకుముందు ‘డీజే’, ‘గద్దలకొండ గణేశ్‌’ సినిమాల్లో ఆయన దర్శకత్వంలో నటించాను.
మహేశ్‌బాబు చిత్రం కూడా ఓకే అయ్యింది. అయితే, చిత్ర యూనిట్‌ పూర్తి వివరాలు వెల్లడిస్తుంది.
అఖిల్‌తో కలిసి చేసిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అక్టోబర్‌ 15న విడుదలైంది. ఇందులో నా పాత్ర పేరు విభా. ఈ సినిమాకు పాజిటివ్‌ రిపోర్ట్స్‌ రావడం ఆనందం కలిగిస్తోంది.
ఇక, అల్లు అర్జున్‌ ` నేను హిట్‌ ఫెయిర్‌గా పేరుతెచ్చుకున్నాం. బన్నీతో కలిసి నేను చేసిన ‘డీజే’, ‘అల వైకుంఠపురంలో.’ తరువాత మళ్లీ మరో సినిమాలో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చర్చల్లో ఉంది.
ఇంకా బాలీవుడ్‌లో, తమిళంలోనూ కొన్ని సినిమాలు చేస్తున్నాను.
నా గురించి..
మాది కర్ణాటకలోని మంగుళూరు. 2010లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో భారత్‌ నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచాను. ‘ముకుంద’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాను. కన్నడతో పాటు హిందీ, ఇంగ్లిష్‌ భాషలు వచ్చు. ఎంకాం చదివాను. మొదట్లో నేను చేసిన తెలుగు సినిమాలు సరిగా ఆడలేదు. దీంతో ఐరన్‌ లెగ్‌ అన్నారు. ప్రస్తుతం వరుస హిట్లు కొట్టడంతో గోల్డెన్‌ లెగ్‌ అంటున్నారు.

Review నీలాంబరివే...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top