అనగనగ ఏడు చేపలు…
‘అనగనగా ఏడుగురు రాజ కుమారులు. ఒకనాడు వేటకు వెళ్లి ఏడు చేపలను వేటాడారు...’ చిన్నప్పుడు అందరూ నానమ్మ, అమ్మమ్మలను, తాతయ్యలను అడిగి పదేపదే చెప్పించుకున్న కథ ఇది. ఈ కథ వినని వారు నిన్నటి తరం వరకూ ఎవరూ ఉండి ఉండరు. అయితే, ఇది చిన్నపిల్లల కథ మాత్రమే కాదు సుమా! ఇందులో నేర్చుకోవడానికి చాలా ఉంది. అందుకే ఇది ఈ కాలం పెద్దలకూ ఉపయోగపడేలా, ఆధ్యాత్మిక వికాసం కలిగించేలా




