అమాయకుడికి అక్షింతలు ఇస్తే?

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘‘కంటికి

శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాల

రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించి ఉన్నాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనం రావణ ప్రోక్త న్యాస పక్రియలోనిది. దీనినే శివ పంచానన స్తోత్రం అనీ అంటారు. మార్చి 4, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ మహాదేవుని శ్లోకార్థ తాత్పర్యం. తత్పురుషణ ముఖ ధ్యానమ్‍ సంపర్తాగ్ని తటిప్రదీప్త కనక ప్రస్పర్థితేజోమయం గంభీర ధ్వని మిశ్రితోగ్ర

రాజా ధర్మానికి ఆద్యుడు భరద్వాజుడు

అంగీరసుడికి శ్రద్ధ అనే భార్య వలన ఇద్దరు కుమారులు కలిగారు. వీరిలో పెద్దవాడు ఉతధ్యుడు. రెండవ వాడు బృహస్పతి. కుమారు లిద్దరికీ తండ్రి వివాహం చేశాడు. ఉతధ్యుడి భార్య మమత. బృహస్పతి భార్య తార. ఇద్దరూ గృహస్థాశ్రమంలో సుఖంగా జీవించసాగారు. కాలం గడు స్తోంది. ఒకనాడు మమత భర్తను సమీపించి పుత్రుని ప్రసాదించాలని కోరగా ఉతధ్యుడు ఆమెను భోగించగా గర్భవతి అయ్యింది. భర్తకు సేవ చేస్తూ గర్భాన్ని రక్షించుకుంటూ కాలక్షేపం

రాముడు చెక్కిన ఆంజనేయుడు

శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే. శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీ తీరాన ఉందీ వాయు క్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‍ । భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్‍ ।। అంటే.. శ్రీరామ సంకీర్తన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో

చంద్రకళాధర సహృదయా!

ఓం నమ:శివాయ ఓం నమ:శివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళాపూర్ణోదయా లయనిలయా పంచభూతములు ముఖపంచకమై ఆరు రుతువులూ ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడిచిన ఏడు అడుగులే స్వర సప్తకమై నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపనమందార నీ మౌనమే దశోపనిషత్తులై ఇల వెలయ త్రికాలములు నీ నేతత్రయమై చతుర్వేదములు ప్రాకరములై గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి రుత్విజవరులై అద్వైతమే నీ ఆది యోగమై నీ లయలే ఈ కాలగమనమై కైలాస గిరివాస నీ గానమే జంత్రగాత్రములు శ్రుతికలయ కె.విశ్వనాథ్‍ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర

Top