పిల్లల ఆటపాటలు…
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక చెమ్మచెక్క చెమ్మ చెక్క, చేరడేసి మొగ్గ అట్లు పొయ్యంగ, ఆరగించంగ ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ రత్నాల చెమ్మచెక్క రంగులెయ్యంగ పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ చూచి వద్దాం రండి, సుబ్బరాయుడి పెండ్లి సూర్యదేవుడి పెండ్లి చూచివద్దాం



