ఏమో… ఏది ఎవరికెరుక

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. సర్వం కర్మాధీనం మంచి కావచ్చు..

రెండు చిలుకలా కథ

పేరుకే పిల్లల కథలు.. పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

జిత్తుల మారి నక్క

శ్యామ్‍ అనే పేరు గల జిత్తులమారి నక్క ఒక అడవిలో నివసిస్తూ ఉండేది. దానికి స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క అందర్నీ మోసం చేస్తూ ఉంటుంది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా యీ నక్కతో కలియవు. స్నేహం చేయవు. దాని నుండి తప్పించుకుని తిరుగుతాయి. రాత్రి వేళ యితర జంతువుల్ని తన కూతతో భయపెడుతుంది. నిశ్శబ్దంగా ఉండే రాత్రిళ్లు దాని కూత వల్ల వేటికీ

ఆడండి .. పాడండి…. మీదే ఈ లోకం

ఎత్తుకోండి.. హత్తుకుపోతారు.. మాట్లాడండి.. మురిసిపోతారు. కథలు చెప్పండి.. కేరింతలు కొడతారు. ఆటలాడించండి..అల్లుకుపోతారు. ఇలా పిల్లల కోసం మనం ఒక్కరోజు చేయగలిగితే చాలు ప్రతి రోజూ అటువంటి రోజు కోసం ఎదురు చూస్తారు పిల్లలు. వారి సంతోషం కంటే విలువైనది కాదు మన సమయం.అమ్మ ఒడి.. నాన్న ఛాతి.. మావయ్య భుజం.. తాతయ్య వీపు.. అన్నీ వారి ఆటస్థలాలే. అంతెందుకు ఈదేశపు భవిష్యత్తే వారు. ఈ దేశమంతా వారిదే. మురిపాల ముచ్చట్లకు, బుడిబుడి

తెలుగుపత్రిక.. ఇకపై సరికొత్తగా..

విలక్షణ శీర్షికలతో తెలుగు వారి లోగిళ్లలో వెలుగులు నింపుతున్న తెలుగుపత్రిక ఆరంభమైన అచిరకాలంలోనే అందరి ఆదరాభిమానాలను చూరగొంది. పది నెలల పాటు విదేశీ గడ్డపై తెలుగు సౌరభాలను విరజిమ్మింది. అయితే, పత్రికను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలుగుపత్రిక బృందం ఇటీవల ఒక సర్వేను నిర్వహించింది. ‘పత్రిక ఎలా ఉంది?’, ‘ఇంకా ఎటువంటి శీర్షికలు కావాలని కోరుకుంటున్నారు?’, ‘పాఠకుల ఆసక్తులు, అభిరుచులు ఏమిటి?’ తదితర అంశాలపై పాఠకుల నాడిని కనుగొనే

Top