ఉత్తరాయణం

పిల్లల చదువులు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పత్రిక నవంబరు సంచికలో అందించిన ప్రత్యేక కథనం బాగుంది. అక్కడి విద్యా విధానం చాలా బాగుంది. పిల్లలను స్కూలుకు పంపే తల్లిదండ్రులు, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, వ్యవస్థను నడిపిస్తున్న ప్రభుత్వాలు నిజంగా ఇలాంటి విద్యా విధానాల గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వాలు అలాంటి విధానాలను అమలు చేయాలి. అలాంటి అత్యుత్తమమైన, అద్భుతమైన విద్యావ్యవస్థను రూపొందించాలి. - పి.రవిశంకర్‍, సీహెచ్‍.అమర్‍నాథ్‍, టి.బిక్షపతి, ఆర్‍.కవిత, తాండూరు రమేశ్‍ మరికొందరు

పుణ్యం.. ధన్యం

ఇళ్లు దీపకాంతులతో వెలుగొందుతూ పండుగ వాతావరణం సంతరించుకునేదీ, హరివిల్లు సాక్షాత్కరించేలా లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో కళకళలాడేదీ ధనుర్మాసంలోనే. ఈ మాసంలో గోదాదేవి చేపట్టిన వ్రతానికి సాక్షాత్తూ రంగనాథుడే దిగి వచ్చాడని చెబుతారు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ ప్రస్తుతించే శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి బదులు తిరుప్పావై సంకీర్తనలు వినిపిస్తాయి. తులసికి బదులు బిల్వ పత్రాలతో శ్రీవేంకటేశ్వరుడిని అర్చిస్తారు. ధనుర్మాసంలో చేసే పూజలు కోరికలను నెరవేరుస్తాయని విశ్వసిస్తారు. ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు మధుసూదనుడిగా పూజలందుకుంటాడు. గోధుమపిండి, బియ్యప్పిండి, మట్టితో

కన్నీరు – చిరునవ్వు

కన్నీరు.. మనసును కలత పెడుతుంది. చిరునవ్వు.. మనిషిని సంతోషభరితం చేస్తుంది. ఈ రెండూ పరస్పర ఆధారితాలు. ఒకదానితో మరొకటి సంబంధం గలవి. ఈ రెండింటి మధ్యా ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి అనాదిగా, అవిశ్రాంతంగా మనిషి చేయని ప్రయత్నం లేదు. అలాగే, ఏళ్లుగా ఈ కన్నీళ్లు, చిరునవ్వుల గురించిన ప్రశ్నలు మానవ మస్తిష్కాలను తొలుస్తూనే ఉన్నాయి. ఏమిటీ కన్నీరు? అదొక శాపం. భగవంతుడి పరోక్షానికి సాక్ష్యం. ఏమిటీ చిరునవ్వు? ఇదొక వరం. భగవంతుడి ప్రత్యక్షానికి సాక్ష్యం. ఈ ప్రశ్నలూ, సమాధానాలు రెండూ మనల్ని తికమక పెడుతుంటాయి.

సిరిచందనపు చెక్కలాంటి భామ

తెలుగు వెండితెరపై అందం, అభినయం కలగలసిన మరో సంచలనం.. రుక్మిణీ వసంత్‍. తెలుగునాట బుల్లితెరపైనే కాదు.. వెండితెరపైనా ‘శాండల్‍వుడ్‍’ సోయగాలు తళుకులీనుతున్నాయి. పూజాహెగ్డే, రష్మిక.. ఈ వరుసలో మరో కన్నడ ముద్దుగుమ్మ రుక్మిణి తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంటోంది. ‘కాంతార చాప్టర్‍-1’ విజయంతో, ఆ సినిమాలో మంచి స్క్రీన్‍ ప్రెజెన్స్తో అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ కన్నడ కస్తూరి ఇటీవలే శివకార్తికేయన్‍ సరసన ‘మదరాసీ’లో తళుక్కుమంది. త్వరలో జూనియర్‍ ఎన్టీఆర్‍

వాళ్లిద్దరూ కలిస్తే.. బ్లాస్ట్

‘పేట్రియాట్‍’ పేరుతో చేతులు కలిపారు మలయాళ అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‍లాల్‍. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. మహేశ్‍ నారాయణన్‍ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‍ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్‍ థ్రిల్లర్‍గా దీన్ని తీర్చిదిద్దినట్టు టీజర్‍తో స్పష్టమవుతోంది. ‘ఒకానొక సమయంలో వాళ్లిద్దరూ దేశాన్ని కంట్రోల్‍ చేసేవారని నాకు మా నాన్న చెప్పడం ఇంకా గుర్తుంది. ఏళ్లు గడిచే

Top