మంచి బుద్ధి గలవారికే… లక్ష్మీసిది
‘వ్రతవ్యే అనేన అనయావా అతి వ్రతం..’ అని స్తుతి. జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. అటువంటి దివ్య వ్రతాన్ని ఆచరించే శుభ సంకల్పం శ్రావణమాసంలో సిద్ధిస్తుంది. అది కూడా మాసంలో ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజ. మన పెద్దలు దీనినే వ్రతం అన్నారు. ఏమికోరినా అనుగ్రహించే తల్లి కాబట్టే ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల,




