‘శుభ’ వత్సరం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సర క్రమంలో నాలుగో నెల- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది తొలి మాసం. అంటే తెలుగు సంవత్సరాదికి ఆద్యమైన మాసం. ఈ మాసారంభపు మొదటి రోజైన శుక్రవారం, ఏప్రిల్‍ 1 మినహా, మిగతా అన్నీ చైత్ర మాసపు తిథులే. చైత్ర మాసంలో వచ్చే పండుగలు, పర్వాలలో ఉగాది, శ్రీరామ నవమి ప్రధానమైనవి. ఇంకా మత్స్య జయంతి, లక్ష్మీ పంచమి. కామద ఏకాదశి, వరూధునీ ఏకాదశి, ధర్మరాజ దశమి, వల్లభాచార్య జయంతి వంటివి ఈ మాసంలోని పర్వాలే.

2022- ఏప్రిల్‍ 1, శుక్రవారం, ఫాల్గుణ బహుళ అమావాస్య నుంచి 2022- ఏప్రిల్‍ 30, శనివారం, చైత్ర బహుళ అమావాస్య వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం- చైత్ర మాసం- వసంత రుతువు- ఉత్తరాయణం

చైత్రం తెలుగు మాసాలలో మొదటిది. ఇది సంవత్సరారంభ మాసం. చైత్ర మాసపు తొలి తిథే (చైత్ర శుద్ధ పాడ్యమి) ఉగాది పర్వం. ఇది తెలుగు వారి అచ్చ తెలుగు పర్వం. ఏప్రిల్‍ 2 ఉగాది పర్వదినం. వసంత నవరాత్రులు కూడా ఈ తిథి నుంచే ఆరంభమవుతాయి. ఏప్రిల్‍ 10న శ్రీరామ నవమి పర్వం. మన తెలుగు వారికి ఏటా వచ్చే దాదాపు యాభై ప్రధాన పర్వాల్లో తొలి పర్వం- ఉగాది. దీనినే సంవత్సరాది అనీ అంటారు. సంవత్సరాది అంటే సంవత్సరానికి ఆరంభదినమని అర్థం.

ఆంధ్రుల సంవత్సరాది నాటి తిథి చైత్ర శుక్ల ప్రతిపత్తు అనగా పాడ్యమి. ఉగాదిని కొన్నిచోట్ల వైశాఖ మాసంలోనూ, మరి కొన్నిచోట్ల కార్తీక మాసంలోనూ, ఇంకొన్ని చోట్ల మార్గశిర మాసంలోనూ, ఇంకా కొన్ని చోట్ల ఫాల్గుణ మాసంలోనూ నిర్వహించుకుంటారు. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ మాసాలలో సంవత్సరాదులు రావడానికి కారణం.. సంవత్సర పరిగణనం వేర్వేరు మాసాలతో జరగడమే. తెలుగు వారు తమ సంవత్సరాదిని చాంద్రమాన పరిగణనగా నిర్ణయిస్తారు.

చాంద్రమాన సంవత్సరం చైత్ర శుక్ల ప్రతిపత్తు (చైత్ర శుద్ధ పాడ్యమి)తో ప్రారంభమవుతుంది. శాస్త్రీయ, లౌకిక ఆచారాలను బట్టి చైత్ర మాసాన్నే ఆర్యుల సంవత్సరాదిగా వ్యావహారికంలో ఉంది. చైత్ర శుక్ల (శుద్ధ) పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మ పురాణం కంఠోక్తిగా చెబుతోంది. వసంత కాలం ఆరంభ దినాల్లో చైత్ర శుక్ల పాడ్యమి నాడు సంవత్సరాది పర్వం జరిపే ఆచారం ఆర్యుల్లో అతి ప్రాచీన కాలం నుంచీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా చైత్ర మాసంలో వచ్చే ప్రధాన పర్వాల పరిచయం..

Review ‘శుభ’ వత్సరం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top