పైనాపిల్‍ రైతా.. తింటే మజా

అమృత్‍సరీ పిన్నీ

కావాల్సినవి: గోధుమ పిండి- 2 కప్పులు, ఉప్మారవ్వ- 2 టేబుల్‍ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము- పావు కప్పు, చక్కెర పొడి లేదా బెల్లం తురుము- 1 కప్పు, నెయ్యి- 1 కప్పు, బాదం తరుగు- పావు కప్పు, పిస్తా తరుగు- 1 టేబుల్‍ స్పూన్‍, ఎండు ద్రాక్ష- పావు కప్పు, యాలకుల పొడి- ముప్పావు టీ స్పూన్‍.

తయారు చేసే విధానం: ముందుగా బాదం, పిస్తా పప్పులను, ఎండు ద్రాక్షలను విడివిడిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఆపైన వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‍పై పాన్‍ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక అందులో గోధుమ పిండిని వేసి కలపాలి. స్టవ్‍ను మీడియం మంటపై పెట్టుకోవాలి. ఆపైన రవ్వ కూడా వేయాలి. అది కాస్తంత రంగు మారాక, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‍ను సిమ్‍లో పెట్టుకుని చక్కెర లేదా బెల్లం వేసి కలపాలి. మిశ్రమం దగ్గరికి అయ్యాక స్టవ్‍ను ఆఫ్‍ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారాక, చేతులకు నెయ్యి రాసుకుని మీకు నచ్చిన ఆకారంలో ఈ పిన్నీలను సిద్ధం చేసుకోవచ్చు.

పైనాపిల్‍ రైతా

కావాల్సినవి: పెరుగు- 1 కప్పు, అనాస పండు (పైనాపిల్‍) ముక్కలు- అర కప్పు, దానిమ్మ గింజలు- పావు కప్పు, కారం లేదా మిరియాల పొడి- పావు టీ స్పూన్‍, చక్కెర- 2 టేబుల్‍ స్పూన్లు, జీలకర్ర పొడి- అర టీ స్పూన్‍, కొత్తిమీర తరుగు (కావాలనుకుంటేనే)- 2 టేబుల్‍ స్పూన్లు, పుదీనా ఆకులు (కావాలనుకుంటేనే)- 10, ఉప్పు- తగినంత.

త•యారు చేసే విధానం: ముందుగా గడ్డగా ఉన్న పెరుగును ఏదైనా చెంచాతో పలుచగా, మృదువుగా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు అందులో కారం లేదా మిరియాల పొడి, చక్కెర, ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులోనే పైనాపిల్‍ ముక్కలు, దానిమ్మ గింజలు వేసుకోవాలి. తరువాత దాన్ని ఫ్రిజ్‍లో పెట్టుకుని కావలసినప్పుడు బయటకు తీసి కొత్తిమీర, పుదీనాతో సర్వ్ చేసుకోవాలి.

లిట్టీ చోఖః

కావాల్సినవి: గోధుమ పిండి- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, నెయ్యి- సరిపడా, శనగ పిండి- 1 కప్పు, జీలకర్ర- అర టీ స్పూన్‍, సోంపు- అర టీ స్పూన్‍, మెంతులు- పావు టీ స్పూన్‍, కారం పొడి- అర టీ స్పూన్‍, పచ్చిమిర్చి తరుగు- 1 టీ స్పూన్‍, అల్లం వెల్లుల్లి తరుగు- 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు- 2 టేబుల్‍ స్పూన్లు, నిమ్మరసం- 2 టేబుల్‍ స్పూన్లు.

తయారు చేసే విధానం: ముందుగా ఓ బౌల్‍లో గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, నెయ్యి, కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, సోంపును పొడి చేసుకోవాలి. మరో బౌల్‍లో శనగ పిండిని తీసుకోవాలి. అందులో పక్కన పెట్టుకున్న పొడులను, మెంతులు, కారం పొడి, పచ్చిమిర్చి తరుగు, అల్లం – వెల్లుల్లి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, నిమ్మరసం, కాస్తంత నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు చల్లుకుని పిండిని కాస్తంత పొడిపొడిగానే కలుపుకోవాలి. ఒక అరగంట తరువతా గోధుమ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని, చపాతీ కర్రతో రుద్దుకోవాలి. దాని మధ్యలో శనగ పిండి మిశ్రమం పెట్టి ఉండగా చేసుకోవాలి. వాటిని కొద్దిగా ఒత్తుకుని స్టవ్‍ లేదా బొగ్గుల మంటపై కాల్చుకోవాలి. వీటిని బంగాళాదుంప, వంకాయి, టమాటా చోఖా (వాటిని విడివిడిగా కాల్చి, చిదుముకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో కలుపుకోవాలి)లతో సర్వ్ చేసుకోవాలి

Review పైనాపిల్‍ రైతా.. తింటే మజా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top