‘కొడుకు పేరు సోమలింగం’

విజయం అనేది కల నుంచే పుడుతుంది. కల కన్నప్పుడే ఆ కలను నిజం చేసుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే, కలకు పగటి కలకు మధ్య రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ దాటితే కల కాస్తా పగటి కలై అపహాస్యం పాలవుతుంది.
ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ కొందరు పగటి కలలు కంటుంటారు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఆ పని తాలూకు విజయాన్ని కలలోనే సొంతం చేసుకుని ఆనందిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఉప యోగించే సామెత లేదా జాతీయమే ‘ఆలూ లేదు చూలూ లేదు కోడుకు పేరు సోమలింగం’. ఇది తెలుగు నాట బాగా ప్రాచుర్యంలో, వాడుకలో ఉన్న సామెత. దీని వెనుక చాలా కథలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి..వెనకటికి ఒక సోమరి, సమయం దొరికితే చాలు పగటి కలలు కనేవాడట. ఒకరోజు చెట్టు కింద నిద్రపోతున్న ఆ సోమరికి మెలకువ వచ్చింది. ఏం చేయాలో తోచక పగటి కలకు ప్రారంభోత్సవం చేశాడు. ‘రేపో మాపో ఒక అందమైన అమ్మాయితో నాకు ఘనంగా పెళ్లవుతుంది. మాకో అందమైన అబ్బాయి పుడతాడు. వాడికి ఏం పేరు పెట్టాలి? రకరకాల పేర్లు మదిలో తలంపునకు వస్తున్నాయి. ఏం పెట్టాలి? చివరకు సోమలింగం అనే పేరు నచ్చి ఆ అబ్బాయికి ఆ పేరే పెడతా..’ అంటూ పగటి కలను అందంగా కని, ‘నా కొడుకు పేరు సోమ లింగం’ అనుకుంటూ మురిసిపోయాడట. ఈ కథ నుంచే ఈ సామెత పుట్టింది.ఇది తెలుగు జన బాహుళ్యంలో జాతీయంగానూ, సామెతగానూ కూడా విరివిగా వాడుకలో ఉంది.

Review ‘కొడుకు పేరు సోమలింగం’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top