కరివెన నిత్యాన్నదాన సత్రం

చిన్నికృష్ణుని వెన్నదొంగ వేషాలు, ఇంటింటికీ వెళ్లి పెరుగన్నం దొంగిలించి తిన్న బాలకృష్ణుడి లీలలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తే సాక్షాత్తూ బాలకృష్ణుడి కడుపు నింపినట్టే. అంతటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే గోపికలు ఈ నందకిశోరుడికి కొసరి కొసరి తినిపించిన క్షేత్రమిది. ఇక్కడకు వచ్చే భక్తులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అన్నదానం చేస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. అటువంటి పుణ్యాన్ని మీరూ పొందాలంటే ఈ సత్రం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించవచ్చు

శ్రీకృష్ణ భగవానుడి లీలలకు ప్రసిద్ధి చెందిన క్షేత్రం బృందావనం. ఉత్తరప్రదేశ్‍లోని మథుర నగరానికి సమీపంలో ఉన్న అందమైన ఈ చిన్న పట్టణం గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. మధుర శ్రీకృష్ణుడి జన్మస్థలం (కృష్ణ జన్మభూమి) కాగా, బృందావనం ఆయన బాల్యలీలలు, రాసక్రీడలు సాగిన పవిత్ర స్థలం. శ్రీకృష్ణ భక్తులకు ఇదే ప్రధానమైన ఆధ్యాత్మిక కేంద్రం. బృందావనంలో అడుగుపెడితే ఆధ్యాత్మిక అనుభూతులు చుట్టుముడతాయి. ఇది చాలా పురాతన క్షేత్రం. యమునా నదీ తీరాన అనేక పురాతన, ప్రాచీన ఆలయాలకు నెలవైన ఈ ప్రాంతం కృష్ణుడి లీలలతో ముడి పడి ఉంది.
బృందావనం.. ఈ పేరే భూలోక నందనవనం. శ్రీకృష్ణుడు తన దివ్యచేష్టలతో ఆడి, పాడిన ప్రదేశమిది. చైతన్యప్రభు నృత్యతన్మయత్వం, మీరాబాయి, సూరదాసు వంటి వారి భక్తిగీతాలు.. ఇప్పుడేమీ ప్రత్యక్షంగా ఆనాటి ఈ దృశ్యాలను మనం చూడలేకపోయినా వాటిని మనసులో ఊహించుకుని తరించవచ్చు.
యమునా తీరాన గల ఈ ప్రాంతం నీలమేఘశ్యాముని నవరస లీలలు, రాసలీలా విశేషాలకు వేదిక. నందకిశోరుని చిన్మయ లీలలు అందంగా చూపించిన చోటిది. యమునా జలాలు శ్యామలం. నీలమేఘ శ్యాముని తనువు నీలం. భక్తులు బృందావనం పేరు చెబితే చిన్నారి చిలిపి కృష్ణుని లీలలు స్ఫురణకు వచ్చి తనువు పులకాంకితమయ్యే మధురమైన తాదాత్మ్యానికి లోనవుతారు.
బృందావనంలో అనేక ధర్మశాలలున్నాయి. ప్రశాంత వాతావరణ పావన యమునా తీర బృందావనమంతా రాసవిహారీ లీలాకృష్ణుని జ్ఞాపికలే. మధురభక్తి తత్వానికి మరువలేని స్మరణలు.. శ్రీచరుని చరణ మంజీరాలు.
బృందావనంలో చిన్నికృష్ణుడుతో పాటు బాంకీ బిహారికా మందిరం, సహబిహారీకీ మందిరం, రాధారమణ మందిరం, గ్వాలియర్‍ మందిరం, యమున వద్ద గల టికారీ మందిరం, నిధివన్‍, కాళీయ మర్దనం జరిగిన చోటు, చీర్‍గాటు, గోపికా వస్త్రాపహరణం చేసి పొన్నచెట్టు మీదకు కృష్ణుడు ఎక్కిన చోటు, రాధావల్లభ్‍జీ, మదన్‍మోహన్‍జీ, అష్టసఖి, జైపూర్‍ మందిర్‍, బన్సీపట్‍ మొదలైనవన్నీ చూడవలసిన ప్రాంతాలే. వీటన్నిటికీ తలమానికమైనది నందభవన్‍. ఇంకా గోవింద దేవునాలయం, చార్‍ సాంప్రదాయ ఆశ్రమం, శ్రీరంగని ఆలయం, రాధావల్లభుని మందిరం, షాజి మందిర్‍, యమునా స్నానఘట్టాలు, జ్ఞానగుదిరి, నింబార్కపురం, నందగావ్‍, నిజబిహారీ వనం, గోవర్ధనగిరి, ధరణితీర్థం.. ఇవన్నీ బృందావనానికి సమీపంలో ఉన్న చూడదగిన ప్రదేశాలే.

కరివెన నిత్యాన్నదాన సత్రం
బృందావనం చిరునామా:

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం భజన్‍ కూటి ఎదురుగా, వశిష్ఠ ఆశ్రమం వెనుక, పరిక్రమ మార్గ్, గోపాల్‍•ర్‍, బృందావనం, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్‍- 281121
ముఖ్యమైన ఫోన్‍ నంబర్లు:
మేనేజర్‍: 83339 07789, 83339 07813
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్‍ ఖాతా:
యూనియన్‍ బ్యాంక్‍ ఆఫ్‍ ఇండియా
అకౌంట్‍ నంబర్‍: 186022010001616
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్‍: యూబీఐఎన్‍0918601
(బృందావనంలోని కరివెన నిత్యాన్నదాన సత్రంలో భోజన, వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి వసతి గృహంలో ఐదు (5) గదులు ఉన్నాయి)

Review కరివెన నిత్యాన్నదాన సత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top