కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రంలో అన్నదానం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. నిత్యం వచ్చే వేలాది భక్తుల ఆకలి తీరుస్తూ, స్వామి వారి ప్రసాదాన్నే అన్నప్రసాదంగా అందిస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల కానీ, అన్నం స్వీకరించడం వల్ల కానీ లేదా అన్నదాన కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పాడు అందించడం వల్ల కానీ సకల దోషాలు తొలగిపోయి, కాణిపాక వరసిద్ధి వినాయకుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అన్నదానం చేయడం వల్ల లేదా అన్నదానం చేసే కరివెన నిత్యాన్నదాన సత్రం వంటి సంస్థల సేవల్లో భాగస్వామ్యం కావడం వల్ల ఆధ్యాత్మికతకు, నిజమైన భక్తికి పరిపూర్ణత చేకూరుతుంది.
సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పే వారికి సింహస్వప్నంగా పూర్వ చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీవరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు పూజలందుకుంటున్నాడు. ఈ స్వామికి హిందువులే కాదు.. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామి వారి దర్శనార్థం నిత్యం వందలాది సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అనే నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు.
క్షేత్ర చరిత్ర
సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ•, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ, ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ వీరు ముగ్గురూ జీవించే వారు. ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది. గ్రామస్తులకు కనీసం ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కాడు. స్వామి వారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే స్వయంగా శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు, తాగుడు, ఇతర దురలవాట్లు గల వారు స్వామి వారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకంలో ప్రమాణం చేద్దామా?’ అని సవాల్ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది. ఇక్కడి పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి ప్రమాణాలు చేయడం ప్రత్యేకం.
నిత్యం పెరిగే స్వామి..
వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై సంవత్సరాల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామి వారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామి వారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామి వారికి ధరింప చేయడం సాధ్యం కావడం లేదు. కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గరి నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకేచోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాజంనేయ స్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి.
శివాజ్ఞ మేరకు నిర్మించిన ఆలయం..
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ ఆలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళరాజు కుళోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట. అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహా గణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.
వరసిద్ధుడి చెంత వరదరాజు
స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా వరదరాజస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గానూ శ్రీమహా విష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజ స్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూల విరాట్టు ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారా యణస్వామి వ్రతాలు నిర్వహిస్తుంటారు.
కలౌ చండీ వినాయక:
‘కలౌ చండీ వినాయక:’ అంటే ఈ కలియుగాన పిలవగానే పలికే దేవతలు చండి (దుర్గ), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం అనేవి కలుగు తుంటాయి. అన్ని విఘ్నాలను అధిగమించాలి అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామి వారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని అంటారు. సకల శుభాలూ కలుగుతాయి.
అలాగే స్వామి వారిని పంచామృతాలతో అభిషే కించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని అంటారు.
గణపతి పురాణంలో సహస్ర నామాల్లో ‘మోదక ప్రియాయ నమ:’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. కాణిపాకం ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది.
నారికేళంతో పూజిస్తే..
వినాయకుడిని గణాధిపతిగా నియమించిన తరువాత అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చాడట. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరి కాయను వలిచిన తరువాత చూస్తే టెంకకు మూడు కన్నులు ఉంటాయి. అటువంటి నారి కేళంతో గణపతిని ఆవాహనం చేసి పూజిస్తే మహా గణపతి సంతుష్టి చెందుతాడు. సకల విఘ్నాలు తొలగి సు•శాంతులు కలుగుతాయి.
రవాణా సౌకర్యాలు
కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం అటు తిరుమల లేదంటే శ్రీకాళహస్తి సందర్శనకు వెళ్తుంటారు కనుక కాణిపాకంలో బస చేసే భక్తుల సంఖ్య తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలని అనుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు లభిస్తాయి. ఇక అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రం ఇక్కడ వసతి సౌకర్యంతో పాటు అన్నదానం నిర్వహిస్తోంది. ఇక్కడ కూడా గదులు లభిస్తాయి.
కరివెన నిత్యాన్నదాన సత్రం
కాణిపాకం చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం
ఇంటి నంబర్: 1-362, యూనియన్ బ్యాంకు ఎదురుగా,
కాణిపాకం, ఆంధప్రదేశ్- 517131
ముఖ్యమైన ఫోన్ నంబర్లు:
మేనేజర్: 83339 07812
83339 07813
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్ ఖాతా:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
అకౌంట్ నంబర్: 136112010001253
ఐఎఫ్‍ఎస్‍సీ కోడ్: యూబీఐఎన్0813613

























































































































































































































































































































































































































Review కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రంలో అన్నదానం.