కొత్త సంవత్సరం
తెలుగు పత్రిక ఏప్రిల్ సంచికలో అందించిన ఉగాది పర్వదిన విశేషాలు ఎంతో బాగున్నాయి. మన సంప్రదాయం యొక్క గొప్పదనాన్ని బాగా వివరించారు. ఆధునికత పెచ్చుమీరిన నేపథ్యంలో మన సంప్రదాయాలను అందరూ గుర్తుంచుకుని, గుర్తించి.. వాటిని అనుసరిస్తూ, పాటిస్తూ మన ఆచార వ్యవహారాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– రాజశేఖర్- హైదరాబాద్, వెంకటేశ్వర్లు- విజయవాడ, కిశోర్, వెంకట్రావు, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
ఉగాది.. పది కృత్యాలు
ఉగాది నాడు ఆచరించాల్సిన పది కృత్యాల గురించి తెలుగు పత్రిక ఏప్రిల్ స•ంచికలో చదివే తెలుసుకున్నాం. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి ఆరగింపు మాత్రమే కాకుండా ఈ పర్వం వెనుక ఉన్న విశేషాలను తెలియచెప్పారు.
– ఆర్.రావ్.సిరికొండ- అట్లాంటా, ఆనందరావు- తిరుపతి, కమల, తెలుగు ఉపాధ్యాయిని, గుంటూరు
నవమి విశేషాలు
శ్రీరామ నవమి సందర్భంగా అందించిన విశేషాలు, ఉగాది పర్వం నేపథ్యం చదివించాయి. మన సంస్కతీ సంప్రదాయాలకు తెలుగుపత్రిక చిరుమానా.
– కె.నవీన్, హైదరాబాద్
Review ఉత్తరాయణం.