పెరటి వైద్యం
మన ఇంటి పెరటిలోనే పెంచుకోదగిన ఔషధ మొక్కలు, వాటి సాయంతో తగ్గించుకోగల వివిధ వ్యాధుల గురించి తెలిపిన తెలుగు పత్రిక మే 2023 సంచికలోని ఆరోగ్య భాగ్యం శీర్షిక ఎంతగానో బాగుంది. మన భారతీయ సంప్రదాయంలోని పెరటి చెట్టు, వంటగది ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిపే కథనమిది.
– ఆర్.శేషగిరిరావు, ఎ.శ్రీనివాస్, ఆనంద్‍సాయి- హైదరాబాద్
వైశాఖ విశేషం
తెలుగు పత్రిక మే 2023 సంచికలో వైశాఖ మాసం గురించి అందించిన విశేషాలు బాగున్నాయి. ఈ మాసాన్ని మాధవ మాసం అంటారనీ, సాధన మాసంగానూ వ్యవహరిస్తారంటూ ఈ మాసంలో ఆచరించదగిన వ్రతాలు, నియమాల గురించి బాగా వివరించారు.
– కె.అరుంధతి- తిరుపతి, ఆర్.విజయభాస్కర్- విశాఖపట్నం, పి.యాదగిరి- వరంగల్, మరికొందరు పాఠకులు
నేటి నీతి కథలు
తెలుగుపత్రిక మే- 2023 సంచికలో అందించిన భారతంలో నీతి కథలు చదివించాయి. భారత, భాగవత, రామాయణాల్లో చక్కని నీతి కథలు ఉన్నాయి. అటువంటివి మరిన్ని అందించే ప్రయత్నం చేయండి. ఇవి నేటి తరం నేర్వాల్సిన నీతి కథలు.
-టి.మధుబాబు, విజయవాడ
Review ఉత్తరాయణం.