వందే వినాయకం..
తెలుగు పత్రిక 2024, సెప్టెంబరు సంచికలో గణనాథుడి గురించి వివిధ కోణాల్లో అందించిన వ్యాసాలు విశేషంగా ఉన్నాయి. గణపతి తత్త్వం, ప్రకృతితో ముడిపడిన వినాయక చవితి ఉత్సవం తదితర వివరాలన్నీ చదివించాయి. అలాగే, కల్పానికో వినాయకుడు, వినాయక జననం గురించి ఇప్పటి వరకు తెలియన కొత్త సంగతులను తెలుసుకోగలిగాం.
-కేఎల్ సదాశివరావు, ఆలమంద వెంకటేశ్వర్లు, టి.సదానంద్, వైష్ణవి, ఆర్.కమలాకర్, గంధం రాజారావు, పి.ప్రభాకర్, మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మాటలు..
మన మాట తీరు ఎలా ఉండాలో సెప్టెంబరు సంచికలో ఆధ్యాత్మిక వికాసం శీర్షిక కింద చక్కగా వివరించారు. మన ప్రవర్తన, భవిష్యత్తు అన్నీ మన మాటలపైనే ఆధారపడిన ఉంటాయని వివరించిన తీరు బాగుంది.
– కుమార్‍రాజా (చిత్తూరు), కవిత (విశాఖపట్నం)
సినిమా కబుర్లు
సినిమా శీర్షిక కింద అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఒక విశ్లేషణతో పాటు కొన్ని సినిమాల కబుర్లు, నాయికల ప్రత్యేకతల గురించి అందిస్తున్న సమాచారం బాగుంటుంది. అలాగే, ఆ నెలలో విడుదలైన సినిమాల రివ్యూలు కూడా ఇస్తే బాగుంటుంది.
– శ్రీకాంత్ (హైదరాబాద్)
Review ఉత్తరాయణం.