దీపావళి పూజ
తెలుగు పత్రిక 2024, అక్టోబరు సంచికలో దీపావళి లక్ష్మీ పూజా విధానం గురించి అందించిన కథనం బాగుంది. ఆనాడు చేయాల్సిన పూజావిధిని చక్కగా అందచేశారు. ఇది దీపావళి నాడే కాక లక్ష్మీపూజ అవసరమైనప్పుడల్లా చేసుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది. ఇంతటి చక్కని వివరాలు అందించినందుకు అభినందనలు.
– రావు బాలగోపాల్, పీ.వేంకటేశ్వరరావు, సి.వి.నందకిశోర్, సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, రాజా రవిచంద్ర, కె.నారాయణరావు, బాలకృష్ణ, పూర్ణిమ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మనసు..మర్మం
మనం బాగుండాలంటే మనసు బాగుండాలంటూ ‘ఆరోగ్య భాగ్యం’ శీర్షికన అందించిన ‘మనసు బాగుందా?’ కథనం ఆలోచింప చేసింది. ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యం ఎంత ము్య•మో బాగా వివరించారు.
– రాజేశ్ (విశాఖపట్నం), సౌభాగ్యమ్మ (హైదరాబాద్), కనకారెడ్డి (చిత్తూరు)
ఆనంద నిలయం
తిరుమల శ్రీవారి ఆనంద నిలయం గురించి అందించిన వివరాలు బాగున్నాయి. ఇంతకు ముందెప్పుడూ చదవని, తెలియని వివరాలు తెలుసుకున్నాం. శ్రీవారి మూర్తిలోని అలంకారాల వివరాలు చదివించాయి.
-టి.కృష్ణకాంత్ (హైదరాబాద్)
Review ఉత్తరాయణం.