త్రిజటుడు
రామాయణంలో త్రిజటుడి పేరు వినడమే తప్ప ఆయన గురించి వివరంగా తెలిసింది లేదు. తెలుగుపత్రిక సెప్టెంబరు సంచికలో ‘పురాణ పాత్రలు’ శీర్షిక కింద ఆయన గురించి వివరంగా తెలుసుకోగలిగాం. అంతటి దారిద్య్రంలోనూ నిజాయితీతో కూడిన ఆయన జీవితం, వ్యక్తిత్వం నిజంగా ఎంతో ఘనమైనవి. ఆయన కథ కదిలించింది. ఇలాంటివే మరిన్ని పురాణ పాత్రలను పరిచయం చేయండి.
– పి.పార్థసారథి, సి.రవి, కె.ఎన్.శ్రీహరి, ఆర్.రవిచంద్రరావు, ఆనంద్‍కుమార్, బసవ రమేశ్‍బాబు మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మహాలయం
ధర్మసందేహం శీర్షిక కింద మహాలయ పక్షంలో చేయాల్సిన విధుల గురించి, నిర్వర్తించాల్సిన పితృసేవల గురించి వివరంగా తెలియచెప్పారు. అమావాస్య తిథిని చెడుగా భావిస్తారు. కానీ, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించే సదవకాశం అమావాస్య నాడే లభిస్తుంది.
– ప్రవీణ్, హైదరాబాద్, నాగరాజు- తిరుపతి
బ్రహ్మోత్సవం
తెలుగు పత్రిక సెప్టెంబరు సంచికలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం గురించి అందించిన వివరాలు బాగున్నాయి. వివిధ వాహనసేవలు, వాటి నేపథ్యం గురించి తెలుసుకోగలిగాం.
-సి.సతీశ్, విజయవాడ









































































Review ఉత్తరాయణం.