పురాణ పాత్రలు
పురాణపాత్రలను ఇదివరకటి కంటే భిన్నంగా చాలా వివరంగా పరిచయం చేస్తున్నారు. గత కొద్ది సంచికలుగా మంధర, త్రిజటుడు శత్రుఘ్నుడు గురించి అందించిన వివరాలు ఎంతగానో చదివించాయి. ముఖ్యంగా అక్టోబరు సంచికలో ముగ్గురన్నల ముద్దుల తమ్ముడు పేరుతో శత్రుఘ్నుడి గురించి ఇదివరకెన్నడూ చదవని విషయాలు తెలుసుకోగలిగాము. మునుముందు కూడా పురాణ పాత్రలను ఇలాగే వివరంగా అందించండి.
– కేఎస్ రవి, పి.ప్రసాద్, సీహెచ్.రవికాంత్, పొద్దుటూరు వినీల్, సుశీల, కె.కిరణ్‍కుమార్ మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
దీపకాంతులు
దీపావళి పర్వాన్ని పురస్కరించుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్న వెరైటీ దీపాల గురించి అందించిన వివరాలు బాగున్నాయి.
– యశోద-తిరుపతి
కార్తీక శోభ
తెలుగు పత్రిక అక్టోబరు సంచికలో కార్తీక మాసం.. దీపావళి పర్వం గురించి తెలియచెబుతూ నెల పొడవునా దీపోత్సవం ఎంత వైభవంగా జరుగుతుందో వివరంగా తెలియచెప్పారు. మన సంప్రదాయంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికంగా అది చూపే ప్రభావాన్ని తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం బాగుంది.
-వెంకట్రావు, హైదరాబాద్









































































Review ఉత్తరాయణం.