గద్ద- పిల్లి కథ

భాగీరథీ తీరంలో ఒక గొప్ప జువ్వి చెట్టు
ఉంది. దాని తొర్రలో జరద్గవం అనే ముసలి గద్ద ఉంది. అది గుడ్డిది. అందువల్ల ఆ చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు దాని మీద జాలిపడి, తెచ్చుకున్న ఆహారంలో కొంత దానికి పెట్టేవి.
ఒకరోజు ద్వీపకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లల్ని తినడానికి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది. దానిని చూసిన పక్షి పిల్లలు భయపడి అరవసాగాయి. ఆ అరుపులు విని గద్ద ఎవరో వచ్చారనుకొని ‘‘ఎవరది?’’ అంటూ గట్టిగా అడిగింది.
అప్పుడు పిల్లి కపటనాటకమాడాలని అనుకుని ‘‘ నేను ద్వీపకర్ణుడనే పిల్లిని’’ అని అంది. ‘‘వెంటనే వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణం దక్కదు’’ అంటూ అరిచింది గద్ద. వెంటనే పిల్లి ‘‘నేను మాంసం తినేదానిని కాదు. చాంద్రాయణ వ్రతం చేస్తు న్నాను. నీవు సకలశాస్త్రములు తెలిసిన దానివని జంతువులు చెప్పుకోవడం విన్నాను. అందుకని నీసేవ చేయడానికి వచ్చాను’’ అంది పిల్లి.
పిల్లులకు మాంసం అంటే ఇష్టం కదా! అందుకే అలా అన్నాను. ఏమీ అనుకోకు’’ అంటూ పిల్లిని చేరదీసింది గద్ద.
ఆ రోజు నుండి పిల్లి, గద్ద దగ్గరకు వస్తూ పోతూ ఉండేది. పిల్లి తగిన సమయం చూసి పక్షిపిల్లలను తినసాగింది. వాటి ఎముకలను గద్ద ఉన్న తొర్రలో పడవేసేది. పక్షులు తమ పిల్లలు కనిపించలేదని బాధపడుతూ గద్ద తొర్ర దగ్గరకు వచ్చాయి. అక్కడ పక్షి పిల్లల ఎముకలు కనిపించాయి. గద్ద తమ పిల్లలను తిని ఉంటుందని నమ్మి పక్షులు గద్దను గోళ్ళతో రక్కి చంపివేసాయి.
ఈ కథ చెప్పి ‘‘కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు’’ అంది కాకి.
ఆ మాటలు విని కోపంతో నక్క, ‘‘నీవు మొదటి సారి ఈ లేడిని కలిసినపుడు నీవూ కొత్త దానివేగా? ఆనాటి నుండి మీరు స్నేహంగాలేరా ? ఇకనైన నీ చెడు బుద్ధిని విడిచి మంచిగా జీవించు’’ అంది.
లేడి కలగజేసుకుని ‘‘మంచిగా జరిగినంత కాలం మనం జతగా ఉండటం మేలు’’ అంది ఆ రోజు నుండి లేడి, కాకి, నక్క స్నేహంగా ఉండేవి. నక్క ఒకసారి లేడి దగ్గరకు వచ్చి ‘‘దట్టంగా పెరిగిన పొలాన్ని చూసాను’’ అంది. లేడిని తీసుకుని నక్క పొలానికి వెళ్లింది. అప్పటి నుండి ప్రతిరోజూ పొలంలో పంటను లేడి తినసాగింది. ఎవరో రోజూ పొలంలో పంట తింటున్నారని గ్రహించిన రైతు వలపన్నాడు. ఆ వలలో లేడి చిక్కుకుంది.
ఇంతలో నక్క అక్కడికి వచ్చింది. వల తాళ్లను కొరకమని నక్కను లేడి అడిగింది. ఈ ‘‘వలను నరంతో చేసినట్లున్నారు. ఆదివారం నేను నరాలను కొరకను’’ అని అంటూ నక్క ప్రక్కనే ఉన్న ఒక పొదచాటున దాక్కుంది. నక్కను నమ్మినందుకు లేడి బాధపడింది. సాయంకాలానికి లేడి రాక పోయేసరికి కాకి వెతుకుతూ పొలం దగ్గరకు వచ్చి లేడిని చూసింది.
ఇంతలో కర్ర పట్టుకుని వస్తున్న రైతుని చూసింది కాకి. లేడిని ఊపిరిబిగపట్టి చని పోయినట్లు నటించమంది. ‘‘నీ పై కూర్చుని నీ కనులు పొడుస్తున్నట్లు నటిస్తాను. సమయం చూసి నేను అరవగానే లేచి పారిపో’’ అని ఉపాయం చెప్పింది కాకి. లేడి, కాకి చెప్పినట్లే చేసింది. రైతు లేడిని చూసి చనిపోయిందనుకొని వలను తప్పించాడు.
వెంటనే కాకి అరిచింది. లేడి మెరుపులా లేచి పరుగుపెట్టింది. రైతు కోపంతో కర్రను బలంగా విసిరాడు. అది గురి తప్పి పొద చాటున ఉన్న నక్కకు తగలి చనిపోయింది.
‘‘ఈ కథ వల్ల పరులకు హాని చేయాలనుకునే వారు తామే చెడిపోతారు’’ అంది. అప్పుడు ఎలుకతో కాకి ‘‘ఇన్ని మా•లెందుకు నిన్ను తినడం వల్ల నా ఆకలి తీరుతుందా ! చితగ్రీవునితో స్నేహం చేసినట్లు నాతోనూ ఉండు. నీ స్నేహం పొందలేని జన్మ ఎందుకు?’’ అంది. ఆ మాటలు విని ‘‘నీవు నా శత్రుపక్షానికి చెందిన దానివి కనుక మనకు స్నేహం కుదరదు. నీ దారిన నీవు వెళ్లు’’ అన్నాడు హిరణ్యకుడు.
‘‘హిరణ్యకా! నీవు చెప్పినట్లు నేను శత్రుపక్షందానినే. కాని నీ మంచితనం మెచ్చి వచ్చాను. నీవు కాదంటే చనిపోతాను’’ అంది కాకి. హిరణ్యకుడు ఆ కాకితో స్నేహానికి ఒప్పుకున్నాడు.
వారిద్దరూ స్నేహంగా ఉండగా ఒకరోజు కాకి, ఎలుకను చూసి ‘‘మిత్రమా! నాకు ఇక్కడ ఆహారం దొరకడం లేదు. మరోచోటికి వెళదామనుకుంటు న్నాను’’ అంది. ‘‘దండకారణ్యంలోని సరోవరంలో నా మిత్రుడైన తాబేలు ఉంది. అక్కడికి వెళతాను’’ అంది కాకి.
‘‘నీవు లేకుండా నేనిక్కడ ఉండలేను’’ అంది ఎలుక. కాకి ఎలుకను వీపుపై కూర్చోబెట్టుకుని మంధరుడనే తాబేలు ఉన్న సరోవరానికి వచ్చింది. వాటిని చూసి తాబేలు పైకి వచ్చింది. కాకిని చూసి ‘‘మిత్రమా! చాలా కాలానికి వచ్చావు. సంతోషం’’ అంది తాబేలు.
కాకి ఎలుకను, తాబేలుకు పరిచయం చేసింది. అప్పుడు తాబేలు ‘‘మిత్రమా! పట్టణాలు ఎన్నో ఉండగా నీవు అడవిలో ఎందుకు ఉంటు న్నావు’’ అంది. దానికి ‘‘నేను మొదట పట్టణంలో నివసించాను. ముందు సుఖంగా ఉన్నా తరువాత బతుకు భారమయింది.
అందుకే అడవికి వచ్చి ఉంటున్నాను. ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పడం మొదలు పెట్టింది ఎలుక

Review గద్ద- పిల్లి కథ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top