ఉత్తరాయణం

ఈ కాలం యోగా
పురాతనమైన యోగ పక్రియల గురించి, అలాగే ఈ తరం జెన్‍జీకి తగిన యోగసాధనల గురించి తెలుగు పత్రిక జూన్‍ సంచికలో విశ్లేషించిన తీరు బాగుంది. ముఖ్యంగా పిల్లల్లో భావోద్వేగాలు అదుపు తప్పుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలకు అలవాటు పడి మెడ, కళ్ల నొప్పి వంటివి కొనితెచ్చుకుంటున్నారు. అటువంటి వారికి ఉపయుక్తం అయ్యేలా సూచించిన మూడు ముఖ్య యోగ పక్రియల వివరణ నిజంగా అద్భుతం. మొత్తానికి జూన్‍ మాసపు సంచిక మంచి వివరాలతో చదివించింది.
-ఆర్‍.రాజశేఖర్‍, సంపత్‍, టి.నరసింహ, పి.శ్రీనివాస్‍, రవిచంద్రకుమార్‍, రాజ్యలక్ష్మి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

శుభ యోగం
2026 సంవత్సరంలోని మంచి రోజులు, మంచి ముహూర్తాలతో పాటు అలాగే మూఢమి రోజుల గురించి తేదీలతో సహా తెలియ చెప్పిన ‘నిండుగా శుభ ముహూర్తాలు.. మెండుగా మంచి రోజులు’ శీర్షిక చదివించింది. ఈ ఏడాది మంచి రోజులేవో ఒక అవగాహన కలిగింది.
– సత్యకిశోర్‍-కల్యాణదుర్గం, పి.కమల-హైదరాబాద్‍

సత్యవత్రుడి కథ
జూన్‍ మాసం తెలుగుపత్రిక సంచికలో పురాణపాత్రలు శీర్షిక కింద అందించిన సత్యవ్రతుడి కథ చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని పురాణపాత్రలను పరిచయం చేయండి.
– రాజారమేశ్‍, హైదరాబాద్‍

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top