ఉత్తరాయణం

మహాలక్ష్మీ నమోస్తుతే!
తెలుగు పత్రిక ఆగస్టు సంచికలో వరలక్ష్మీ వ్రత దినం సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ఆ మహాలక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది? ఎలాంటి వారిని దూరం పెడుతుంది? ఎక్కడ కొలువై ఉంటుంది? అనే విశేషాలను ఎంతో విపులంగా వివరించారు. శ్రావణ మాస శుభవేళ లక్ష్యసిద్ధిని కలిగించే ఆ సిద్ధిధాత్రి గురించి ఇచ్చిన ఈ ప్రత్యేక కథనం ఎంతగానో చదివించింది.
– ఎస్‍.శ్రీకాంత్‍, రాజా రమేశ్‍, టీఆర్‍ రాజేశ్వరరావు, ఎ.వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాస్‍, కె.కవిత, సాయి సుదర్శన్‍, టి.వెంకటలక్ష్మి మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు

శావ్రణ పస్రాదం
ఆయా కాలాల్లో మన పెద్దలు ఏం తినాలో, భగవంతుడికి ఏం నివేదించి ఆ తరువాత వాటిని మహా ప్రసాదంగా స్వీకరించాలో ఎంతో ముందుచూపుతో నిర్దేశించారు. అటువంటి శ్రావణ ప్రసాదాల గురించి తెలుగుపత్రిక ఆగస్టు సంచికలో సందర్భానుసారం అందించిన కథనం చదివించింది.
– సీ. రవికిశోర్‍, తిరుపతి

తిరుమల కొండ
ఆగస్టు మాసం తెలుగుపత్రిక సంచికలో తిరుమల కొండ ప్రాశస్త్యం గురించి అందించిన వివరాల ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. అలాగే తిరుమల సమాచారం ఆసక్తికరంగా ఉంది.
– జి.సాయి, విశాఖపట్నం

Review ఉత్తరాయణం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top