వందే కృష్ణం గణపతిం
తెలుగు పత్రిక సెప్టెంబరు సంచికలో కృష్ణాష్టమి, వినాయక చవితి పర్వాలను పురస్కరించుకుని ఈ రెండు దైవాల సారూప్య విశేషాలను వర్ణిస్తూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ఏ పనికైనా తొలి అడుగు వేసేది వినాయకుని ఆశీర్వాదంతోనేననీ, మలి ప్రయాణం కృష్ణుడి వేలు పట్టుకుని చేసేదనీ.. ఇలా పలు అంశాల్లో రెండు దైవాల గురించి అందించిన విశేషాలు చదివించాయి.
– టీఆర్ ప్రసన్నకుమార్, కె.రాజమౌళి మరికొందరు ఆన్‍లైన్ పాఠకులు
మిలటరీ మెథడ్
చక్కని నిద్రకు సూచించిన మిలటరీ మెథడ్ బాగుంది. ఎవరికైనా నడుం వాల్చిన రెండు నిమిషాలకే నిద్ర పట్టడమనేది నిజంగానే వరం.
– పి.వెంకట్, హైదరాబా•
సామెతలు
మన తెలుగు సామెతల వెనుకున్న నిగూఢార్థాన్ని ‘సామెత కథ’ శీర్షిక ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. ఆయా సామెతల నేపథ్యాన్ని సంక్షిప్తంగా వివరించడం బాగుంది.
– ప్రవీణ్, టి.రాజాజీ, ప్రకా•రెడ్డి, జీవన్
శ్రీవారి సేవ
శ్రీవారికి అందించే విరాళాలు.. అందుకు ప్రతిగా కల్పించే సౌకర్యాల గురించి కూలంకషంగా వివరించారు.
– కుసుమకుమార్, తిరుపతి

















































































Review ఉత్తరాయణం.