పురాణ పాత్రలు

మన పురాణాల్లో ఎన్నెన్నో పాత్రలు.. అవన్నీ ఒక్కో ఆదర్శం.. ఒక్కో పాఠం. కొన్ని స్ఫూర్తి నింపేవైతే మరికొన్ని ఎలా ఉండకూడదో తెలుపుతాయి. మొత్తానికి అన్ని పాత్రలు మనకో పాఠం నేర్పేవే. అటువంటి విశిష్ట పాత్రల్లో వాల్మీకి ఒకరు. రామాయణాన్ని లోకానికి అందించిన ఆ ఆదికవి గురించి తెలుసుకుందాం.
వాల్మీకి సంస్క•త సాహిత్యంలో ప్రసిద్ధ కవి. రామాయణాన్ని రచించాడు. ఈయనను సంస్క•త భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఈయనే శ్లోకమనే పక్రియను కనుగొన్నారు. ప్రచేతసుని కుమారుడు కాబట్టి ఈయనను ప్రాచేతసుడు అని కూడా అంటారు.
వల్మీకము (పుట్ట) నుంచి వెలుపలికి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడని అంటారు. ఈయన పుట్టలో ఉండి ‘మరామరా’ అని తపస్సు చేసి మహర్షి అయ్యాడు. రాముడి జీవిత చరిత్రను రామాయణంగా మలిచి లోకానికి అందించి ఆదికవి అయ్యాడు.
వ్యాసుడు తాను మత్స్యగంధి, పరాశరుల కుమారుడినని తన రచనల ఆరంభంలో చెప్పుకోవడం వల్ల ఆయన ఎవరన్నది కచ్చితంగా తెలిసింది. అయితే వాల్మీకి తన జననం గురించి, తల్లిదండ్రుల గురించి ఎక్కడా పేర్కొనలేదు. అయితే, సందర్భానుసారంగా సీతను రాముడికి అప్పచెబుతున్న సమయంలో ఉత్తరకాండలో వాల్మీకి ఇలా రాశాడు.
‘రామా.. నేను ప్రాచేతసుడనే మహర్షిని. సీత నిన్ను తప్ప మనసా, వాచా పర పురుషుడిని ఎరగని మహా పతివ్రత. నా మాట నమ్ము. సీతను ఏలుకో. నా మాటలు తప్పు, అబద్ధం అయితే ఇంతకాలం నేను చేసిన తపస్సు భగ్నం అవుగాక’ అంటాడు.
ఇది వాల్మీకి తనకు తాను తన గురించి చెప్పు కున్న విషయం. అయితే ప్రచేతసుడు ఎవరు? ప్రచేతసుడు ఎవరి కుమారుడు? ఆయనది ఏ వంశం? అనేవి తెలుసుకోవాలంటే అనేక పురా ణాలను చదవాల్సిందే. శ్రీమద్భాగవతంలో ప్రచేత సుడి ప్రస్తావన ఉంది. ప్రచేతస వంశీయులు బోయలు. క్షత్రియులు. విష్ణుభక్తులు.
వాల్మీకికే కిరాతుడు, రత్నాకరుడు, అగ్నిశర్మ అనే పేర్లు కూడా ఉన్నట్టు తెలియవస్తోంది.
కాళిదాసు వాల్మీకిని మహోన్నతంగా ఆరాధించాడు. అందుకే తన మేఘ సందేశంలోని శ్లోక భాగంలో గొప్పగా ప్రస్తుతించాడు.
వాల్మీకి మహర్షి జీవించిన కాలంపై అనేక పరిశోధనలు జరిగాయి. వాల్మీకి రామాయణం క్రీస్తు పూర్వం వెయ్యివ సంవత్సర ప్రారంభంలో రచించి ఉంటారని అంటారు.
వాల్మీకి మహర్షిని ఆదికవి, రుక్షకుడు, భార్గవుడు, కవికోకిల, వాక్యవిశారదుడు, మహా జ్ఞాని, భగవాన్‍ అని కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో పిలుస్తారు.
‘ఓం ఐం హ్రీం క్లీం శ్రీం’ అనే బీజాక్షరాలను లోకానికి పరిచయం చేసింది వాల్మీకి మహర్షియే.
రామాయణ గ్రంథకర్తగానే వాల్మీకి అందరికీ పరిచయం. ఆయన రచించిన రామాయణ వాల్మీ కంలో ఇరవై మూడు వేల శ్లోకాలు ఏడు కాండా లుగా ఉన్నాయి. రామాయణంలో నాలుగు లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహా భారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్స్ కంటే ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణంలో తెలిపిన విషయాలు కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమైనవని భారత దార్శనికులు విశ్వసిస్తారు.
వాల్మీకి.. రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడినని పేర్కొన్నాడు. వాల్మీకిని అరణ్య వాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపి నపుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఆశ్రమంలోనే సీత లవ – కుశలకు జన్మనిచ్చినట్టు, వీరిద్దరి విద్యాభ్యాసం వాల్మీకి శిష్యరికంలోనే జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది.
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువు కాట కాల కారణంగా ఉత్తర భారతదేశం నుంచి వలస బాట పట్టి.. నల్లమల అడవుల గుండా దక్షిణ భారతానికి వచ్చి.. ఆపై శ్రీలంకకు వెళ్లాడని అంటారు. శ్రీలంకలోనే తన రామాయణాన్ని యుద్ధ కాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముగించాడని విశ్లేషకుల భావన.

Review పురాణ పాత్రలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top