ఆహారం కోసం.. ఆదుకునే వారి కోసం శ్రీరాముడిని వేడుకునే పిలుపది. ఇది ప్రసిద్ధ తెలుగు వాక్యం. ఇది ఆకలి బాధను, రాముడిపై భక్తులకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. ‘ఓ రామచంద్రా! ఆకలితో ఉన్నాను.. ఆదుకో!’ అని దీనికి అర్థం చెప్పుకోవచ్చు. రాముడు నడయాడిన నేలంతా రామరాజ్యమే. అలాంటి రామరాజ్యంలో ఆకలితో ఎవరూ అలమటించరని, ఒకవేళ ఆకలితో ఉన్న వారు ఆ శ్రీరామచంద్రుడిని తలుచుకుంటే అన్నం దొరుకుతుందని హైందవ ధర్మంలో ఒక బలమైన విశ్వాసం ఉంది. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం రామనామం జపించడం కంటే ఉత్తమమైనదని అంటారు. అన్నం లేక అలమటించే అభాగ్యులకు, ఆకలితో ఉన్న వారికి శ్రీరాముడే దిక్కని చెప్పే ‘అన్నమో రామచంద్రా!’ అనే పిలుపు భద్రాచలంలో వినబడదు. ఎందుకంటే అక్కడ భక్తుల ఆకలిని తీర్చే అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ఉంది. ఇది ఏళ్లుగా భద్రాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల కడుపు నింపుతోంది. దైవదర్శనానికి వచ్చిన భక్తులెవరూ ఖాళీ కడుపుతో వెనక్కి వెళ్లకూడదనే సంకల్పంతో ఈ సత్రాన్ని అత్యంత అంకితభావంతో నిర్వహిస్తున్నారు. అలాగే పన్నెండు వసతి గదుల భవనం కూడా ఈ సత్రం ఆధ్వర్యంలో నడుస్తోంది. పావన గోదావరీ తీరాన వెలసిన భద్రాచల క్షేత్రం దక్షిణ భారతదేశపు అయోధ్యగా పేర్గాంచింది. ఇక్కడ శ్రీరామచంద్రుడిని భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుచుకుంటారు. ఏటా ఇక్కడ శ్రీరామ నవమి వేళ సీతారామ కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఆధ్యాత్మిక ఘట్టాలను వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ముక్కోటి ఏకాదశి పర్వదినాన వైకుంఠ రాముడు ఉత్తరాభిముఖుడై ఇచ్చే దర్శనం కోసమే లక్షలాది మంది భక్తులు ఆనాడు చీమల్లా బారులుతీరుతారు. ఇంకా వివిధ పండుగలు, పర్వదిన సందర్భాల్లో ఇక్కడ నిర్వహించే వేడుకలు, పుణ్య కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చే భక్తులకు కరివెన నిత్యాన్నదాన సత్రం ఎన్నో సేవలందిస్తోంది. ఈ సత్రం ద్వారా అన్నదానం నిర్వహించాలనుకునే వారు నిర్వాహకులను సంప్రదించవచ్చు. భద్రాచలంలో అన్నదానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతమని, అది జీవితంలో ఆనందాన్ని భద్రాచలం మహా పుణ్యక్షేత్రం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రగిరి భూలోక వైకుంఠమై దర్శనమిస్తోంది. గోదావరి పర
వళ్లు వీనులవిందు చేస్తుండగా, మిన్నంటిన వేద మంత్రోచ్ఛారణలతో ప్రతి మది భక్తి పారవశ్యంతో నిండిపోతుంది. ఈ క్షేత్ర చరితం వింటే చాలు అంతా శుభమే కలుగుతుందని పండితులు చెబుతారు. ధర్మమే రామావతారం రూపుదాల్చి భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు.. అన్న రామదాసు మాట అక్షరాలా నిజం.
భద్రుడి హృదయంలో..
సీతారాములు వనవాస కాలంలో దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో నివసించారు. ఆ సమయంలో ఒకనాటి విహార వేళ విశ్రాంతి స్థానమైన ఒక శిల ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి, వారి అనుగ్రహానికి పాత్రమైంది. ఆ శిలయే భద్రుడు. బ్రహ్మదేవుడి వరప్రసాదంగా మేరు పర్వతరాజ దంపతులకు పుత్రుడై జన్మించాడు భద్రుడు. శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు. శ్రీరామ సాక్షాత్కారం కోసం దండకారణ్యంలో ఘోర తపస్సు చేశాడు. శ్రీరాముడు చతుర్భుజ రాముడిగా సీత, లక్ష్మణుడితో కూడి పద్మాసనమున ఆసీనుడై భద్రుడికి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంలోకి మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముద్రలను ఉంచిన రాముడు పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా భద్రుడి హృదయ స్థానమున వెలిశాడు. భద్రుడు అచలమై (కొండ)నందున ఈ క్షేత్రానికి భద్రాచలం అనే పేరు వచ్చింది. భద్రాచల రాముడిని సేవించిన వారు సకల పాప విముక్తులై తరిస్తారని బ్రహ్మ పురాణం చెబుతోంది.
తాటాకు పందిరి..
రాముడు భదాద్రిలో కొలువయ్యాక తొలి ఆరాధన దేవర్షి నారదుడు చేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. 16వ శతాబ్దంలో పోకల దమ్మక్క సీతారాముల వారికి తాటాకు పందిరి వేసి తాటిపండు నైవేద్యంగా అందించేది. ఈమె ఇచ్చిన సమాచారంతో అప్పటి హసనాబాద్ (పాల్వంచ) తహసీల్దార్ కంచెర్ల గోపన్న రామాలయాన్ని నిర్మించి రామదాసుగా కీర్తి గడించాడు. 1831లో రాజా తూము లక్ష్మీనరసింహ దాసు ఆలయ అధికారిగా వ్యవహరించి విశేష సేవలు అందించాడు. ఇతని స్నేహితుడు వరద రామదాసు. ఇతడే భక్త రామదాసు చరిత్రను తొలిసారిగా గ్రంథస్థం చేశాడు.
రామ దర్బారు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కోవెలలో జరిగే ప్రతి ఉత్సవంలో విధిగా విష్వక్సేన పూజ జరుగుతుంది. రోజూ సాయంత్రం జరిగే దర్బారు సేవ భద్రాచలం దేవస్థానం ప్రత్యేకం. మహారాజైన శ్రీరాముడికి దర్బారు నిర్వహించే విధానాన్ని తూము లక్ష్మీనరసింహదాసు ప్రవేశపెట్టారు. దర్బారు సేవను ప్రభుత్వోత్సవమనీ అంటారు. రోజూ వచ్చే ఆదాయ వివరాలను దర్బారులో రామయ్యకు వివరిస్తారు. సంకీర్తనలకు అనుగుణంగా స్వామి వారికి ఆరాధన జరిగే విధానం ఇక్కడే ప్రారంభమైంది. ఇక్ష్వాకు కులదైవమైన శ్రీరంగనాథుడి ఆలయ ఉత్సవాల ఆచార సంప్రదాయాలను ఇక్కడ అనుసరిస్తారు. భద్రాచలంలోని ఎత్తయిన కొండపై రంగనాథుడు కొలువై ఉండటంతో ఈ కొండను రంగనాయకుల గుట్టగా పిలుస్తారు.
కల్యాణ వైభోగం..
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేళ వైకుంఠ ద్వార దర్శనం ప్రముఖమైనది. ఇక, శ్రీరామ నవమికి ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణం జగత్కల్యాణంగా భాసిల్లుతుంది. సీతమ్మ వారి మూడు సూత్రాల మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలను చాటి చెబుతుందన్నది భక్తుల భావన. పితృ వాత్సల్యంతో భక్త రామదాసు చేయించి మంగళ పతకాన్ని కలిపి ధరింప చేయడం ఈ క్షేత్ర ఆచారం. తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం ఇక్కడి తలంబ్రాలలో గులాలు అనే రంగును కలుపుతారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించని రామదాసు చెరసాల పాలవడం, రామలక్ష్మణులు రామోజీ, లక్ష్మోజీ పేర్లతో వచ్చి ఆ పైకాన్ని చెల్లించి రామదాసును బంధవిముక్తుడిని చేయడం మనకు తెలిసిన కథే. ఈ సంఘటన జరిగినప్పటి నుంచీ భదాద్రిలో జరిగే కల్యాణానికి రాజు ముత్యాల తలంబ్రాలను, పట్టు వస్త్రాలను పంపడం ఆనవాయితీ అయింది. ఈ ఆచారాన్ని ప్రస్తుత ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి.
2047లో శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకం
ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణం ఎంత రమణీయమో.. రామ పట్టాభిషేకానికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతీ అరవై ఏళ్లకు రాజుకు పట్టాభిషేకం చేయాలనేది పండితుల భావన. 1927లో, ఆ తరువాత 1987లో ఈ తరహా పట్టాభిషేకం భద్రాచలంలో జరిగింది. దీన్ని మహా సామ్రాజ్య పట్టాభిషేకం అంటారు. 2047లో మళ్లీ ఇది జరగనుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేది పుష్కర పట్టాభిషేకం. ఇక, ఏటా శ్రీరామ నవమి తరువాత రోజు కూడా పట్టాభిషేకం కనులపండువగా నిర్వహించడం సంప్రదాయం.
ఎలా వెళ్లాలి?
ఖమ్మం నుంచి భద్రాచలం 120 కిలోమీటర్ల దూరం. భదాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి భద్రాచలం 40 కిలోమీటర్ల దూరం. ఈ రెండు చోట్ల నుంచి బస్సు సౌకర్యం విరివిగా ఉంది. రైలులో వచ్చే వారు ఖమ్మంలో కానీ, కొత్తగూడెంలో కానీ దిగి రావచ్చు. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పర్ణశాల దర్శనీయ ప్రాంతం. సీతారాముల వారు నివసించిన ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.
అన్నమో రామచంద్రా!
ధనికుడైన హరిశర్మ పరమ లోభి. తాను కడుపు నిండా తినకపోవడమే కాక భార్యాబిడ్డలను కూడా తృప్తిగా తిననిచ్చే వాడు కాదు. ఎంతో గొప్ప విష్ణు భక్తుడైనప్పటికీ ఏనాడూ దేవుడికి కూడా ఇంత నైవేద్యం సమర్పించిన దాఖలా లేదు. ఒకనాడు అతను చనిపోయాక దూతలు వచ్చి నేరుగా యముడి వద్దకు తీసుకెళ్లారు. అతడి పేరు హరిశర్మ అనీ, విష్ణుగుప్తుడని చిత్రగుప్తుడు యముడికి చెప్పాడు. విష్ణుభక్తుడు కావడంతో యముడు అతడిని వైకుంఠానికి పంపించాడు. హరిశర్మకు అక్కడ సర్వభోగాలూ ఏర్పాటు చేశారు. కానీ, ఆహారం మాత్రం ఇచ్చేవారు కాదు. దాంతో ఆకలికి తాళలేక హరిశర్మ తన బాధను స్వామికి చెప్పుకున్నాడు. విష్ణుమూర్తి నవ్వి అతడిని బ్రహ్మ వద్దకు పంపాడు.
బ్రహ్మ హరిశర్మను తేరిపార చూస్తూ ‘విప్రోత్తమా! అన్నపానీయాలను మించిన దానం లేదు. ఏనాడైనా ఆ దానాన్ని చేశావా?’ అని అడిగాడు.
‘లేదు. కానీ, నేను నిరంతరం ఆ విష్ణుమూర్తి సేవలోనే గడిపాను. నిత్యం ఆయన పూజాదికాల్లోనే గడిపాను’ అని బదులిచ్చాడు హరిశర్మ.
‘పోనీ ఆ దైవాన్ని అంతలా పూజించావు కదా? ఏనాడైనా ఇంత నైవేద్యమన్నా సమర్పించావా? లేదు కదా! అక్కడ నువ్వు పెట్టిందే ఇక్కడ నీకు దక్కుతుంది. బతికుండగా ఎవరికీ ఎలాంటి దానధర్మాలూ చేయని నీకు ఈ లోకంలో ఆహారం ఎలా లభిస్తుందని అనుకున్నావు?’ అని నిలదీశాడు బ్రహ్మదేవుడు.
‘అయితే నా గతి ఇంతేనా? ఆకలితో అలమటించాల్సిందేనా?’ అని దీనంగా ముఖం పెట్టాడు హరిశర్మ.
అతడి బాధ చూసిన బ్రహ్మదేవుడు శాంతచిత్తుడై ‘నువ్వు నీ బిడ్డలకు స్వప్నంలో కనిపించి నీ దీనావస్థను గురించి చెప్పుకో. రోజుకు ఒక్కరికైనా అన్నదానం చేయాలని వారికి చెప్పు. అక్కడ నీ సంతానం అన్నదానం చేసిన రోజునే నీకు ఇక్కడ భోజనం లభిస్తుంది. నీకు ఇంతకుమించి ఆకలి బాధ తీరే అవకాశం లేదు’ అని తరుణోపాయం సూచించాడు.
హరిశర్మ బ్రహ్మ చెప్పినట్టే చేశాడు. తన కుమారులకు రోజూ కలలో కనిపించి అన్నదాన ప్రాధాన్యం గురించి వారికి ఎరుకపరుస్తూ.. వారు రోజుకొకరికైనా అన్నదానం చేసేలా ప్రోత్సహించాడు. వారలా చేయగానే వైకుంఠంలో హరిశర్మకు ఆకలి బాధ తీరిపోయింది.
అన్నదాన ప్రాముఖ్యతను తెలిపే ఈ కథ పద్మ పురాణంలోనిది.
కరివెన నిత్యాన్నదాన సత్రం
భద్రాచలం చిరునామా:
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం, మెయిన్ రోడ్డు, రాములవారి కల్యాణ మండపం ఎదురుగా, భద్రాచలం, తెలంగాణ- 507111
ముఖ్యమైన ఫోన్ నంబర్లు:
మేనేజర్: 83339 07796, హెల్ప్‌లైన్: 83339 07979
వసతి/అన్నదాన విరాళాలిచ్చేందుకు బ్యాంక్ ఖాతా:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అకౌంట్ నంబర్: 10687785389 ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0010685
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
అకౌంట్ నంబర్: 004310011902637
ఐఎఫ్ఎస్సీ కోడ్: యూబీఐఎన్0800431
(భద్రాచలంలోని కరివెన నిత్యాన్నదాన సత్రంలో పన్నెండు వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. అలాగే భోజన సదుపాయమూ ఉంది

























































































































































































































































































































































































































Review అన్నమో రామచంద్రా! అని నానుడి. ఆకలితో ఉన్న వారు.